Varsh Emmanule : నిజంగానే ప్రేమలో ఉన్న వర్ష ఇమాన్యుయేల్.. బయటపడిన మ్యాటర్!
Varsh Emmanule బుల్లితెరపై లవ్ ట్రాకులు ఎప్పుడూ వర్కవుట్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ షోలైన జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీలో అయితే పులిహోర బ్యాచులు, లవ్ ట్రాకులు బాగానే క్లిక్ అవుతుంటాయి. అయితే సుధీర్ రష్మీ లెవెల్‌లో ఏ జంట కూడా ఆదరణను పొందలేదు. కానీ ఈ మధ్య వర్ష ఇమాన్యుయేల్ జంటకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ టీం కూడా ఈ జోడికి బాగానే స్పేస్ ఇస్తోంది. ఇద్దరినీ బాగానే ఎలివేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరూ కూడా స్కిట్లలో రెచ్చిపోతోన్నారు.

varsh emmanule love matter in jabardasth skit
నిజంగానే ప్రేమలో ఉన్న వర్ష ఇమాన్యుయేల్.. బయటపడిన మ్యాటర్! Varsh Emmanule
ఏకంగా ఈ ఇద్దరి మీద ఈవెంట్ కూడా ప్లాన్ చేసేశారు. మొన్నీ మధ్యనే శ్రీదేవీ డ్రామా కంపెనీలో కూడా ఈ జంటకు పెళ్లి చేసినట్టుగా ఓ ఈవెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడ్డారు. ఇక ఆ తరువాత వీరి ప్రేమ కహాని మీద రోజా వేసిన ఎమోషనల్ డైలాగ్‌లు, వర్ష ఇమాన్యుయల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌కు గురయ్యాయి. అలా మొత్తంగా ప్రతీ వారం ఏదో ఒక స్కిట్‌తో తమ పర్సనల్ విషయాన్ని కూడా టచ్ చేస్తున్నారు.

varsh emmanule love matter in jabardasth skit
తాజాగా వదిలిన ప్రోమోలో వర్ష బిచ్చగత్తెలా మారిపోయింది. అడుక్కునే పిచ్చిదాని పాత్ర వేసింది. సినీ రైటర్‌గా ఇమాన్యుయేల్ నటించాడు. నిన్ను హీరోయిన్‌ను చేస్తాను అంటూ సితారా సినిమా స్టైల్లో బిల్డప్ ఇచ్చాడు. నేను పిచ్చిదాన్ని అంటూ వర్ష చెప్పుకొచ్చింది. అవును నువ్ పిచ్చిదానివి కాబట్టే నన్ను ప్రేమిస్తున్నావ్ అని ఇమాన్యుయేల్ అనేశాడు. అలా అది స్కిట్‌లో భాగంగా అన్నాడా? లేదా? నిజంగా తన మనసులోని మాట అనేశాడో తెలియడం లేదు.

ఇది కూడా చదవండి ==> చటుక్కున ముద్దు పెట్టిన జబర్దస్త్ రాకేష్.. షాక్ తిన్న రోహిణి
ఇది కూడా చదవండి ==> RRR రైటర్ రివీల్ చేసిన టాప్ సీక్రెట్ 900 కోట్లు కొల్లగొట్టిన సినిమాకు సీక్వెల్.. హీరో ఎవరంటే..?
ఇది కూడా చదవండి ==> నిన్ను కోటి రూపాయల హీరోయిన్ ను చేస్తా.. ఆ నటికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బండ్ల గణేశ్?
ఇది కూడా చదవండి ==> ఇమ్మాన్యుయేల్ కు వేరే పెళ్లి అయితే ఏం చేస్తావ్.. రోజా ప్రశ్నకు వర్ష సమాధానానికి అందరు షాక్..! వీడియో