నీ స్థాయి ఏంటో చూసుకో అన్నాడట.. రెమ్యూనరేషన్‌పై తేజ కామెంట్లకు ఆర్పీ పట్నాయక్ హర్ట్

Advertisement

డైరెక్టర్ తేజ, ఆర్పీ పట్నాయక్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరూ ‘చిత్రం’ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి దాదాపు ఈ ఇద్దరూ కలిసి దశాబ్దానికి పైగా పని చేసినట్టున్నారు. ఈ కాంబోలో నువ్వు నేను, జయం వంటి బ్లాక్ బస్టర్లెన్నో వచ్చాయి. అయితే ఈ ఇద్దరి మధ్య కూడా విబేధాలు గొడవలు జరిగాయి. అందులో ఓ సంఘటన గురించి ఆర్పీ పట్నాయక్ చెప్పాడు. దర్శకుడు తేజ అన్న మాటలకు ఆర్పీ పట్నాయక్ బాధపడ్డాడట.

Advertisement
RP Patnaik Clashes with Teja In Avunanna Kadanna
RP Patnaik Clashes with Teja In Avunanna Kadanna

ఔనన్నా కాదన్న సినిమా రెమ్యూనరేషన్ విషయంలో ఆర్పీ పట్నాయక్‌కు అన్యాయం జరిగిందట. తాను ముందుగా రెమ్యూనరేషన్ అడగనని, అయినా ఇంత ఇవ్వమని అంత ఇవ్వమని ఎప్పుడూ ఎవరినీ అడగలేదని ఆర్పీ పట్నాయక్ చెప్పుకొచ్చాడు. అయితే ఆర్పీ పట్నాయక్ తేజ మధ్యన ఔనన్నా కాదన్న సినిమా రెమ్యూనరేషన్ విషయంలో గొడవ జరిగిందట. అన్ని సినిమాలకు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఔనన్నా కాదన్న సినిమాకు తక్కువగా ఇచ్చారట.

Advertisement

తాను మూమూలుగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే చాలా తక్కువగా ఇచ్చారని తెలిపాడు. ఆ సమయంలో తనకు కూడా ఎలాంటి ఆఫర్స్ లేవు.. కొన్ని అవసరాలు కూడా వచ్చి పడ్డాయని అన్నాడు. అయితే నిర్మాత రెమ్యూనరేషన్ తక్కువ ఇచ్చాడని తేజకు చెబితే.. నీ స్థాయి ఏంటో చూసుకో అన్నాడు. ఆ మాటకు చాలా బాధపడ్డాను. అయితే ఆ తరువాత కూడా తేజతో మాట్లాడుకున్నాం.. టచ్‌లోనే ఉన్నాం. కానీ ఆ మాటకు మాత్రం కాస్త బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement