YS Jagan : జగన్ vs మిగిలిన అందరూ… ఇదే జరగబోతోంది :: కానీ వైసీపీ 100+ గ్యారెంటీ ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : జగన్ vs మిగిలిన అందరూ… ఇదే జరగబోతోంది :: కానీ వైసీపీ 100+ గ్యారెంటీ ?

YS Jagan : ఇది సరిగ్గా ఊహించినదే. అవును.. పక్కాగా ఊహించినదే. అధికార వైసీపీ పార్టీ ముందే ఊహించింది. 40 ఇయర్స్ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడలు పక్కాగా వేస్తారని అంతా భావించారు. అలాగే జరిగింది. ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదని ఏపీ ప్రజలకు ఎప్పుడో తెలిసింది. ఒక్క పార్టీని వైసీపీని ఓడించే దమ్ము చంద్రబాబుకు లేదు. అందుకే.. ఢిల్లీకి వెళ్లి బీజేపీతో మంతనాలు ప్రారంభించారు. ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఆ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :5 June 2023,10:00 am

YS Jagan : ఇది సరిగ్గా ఊహించినదే. అవును.. పక్కాగా ఊహించినదే. అధికార వైసీపీ పార్టీ ముందే ఊహించింది. 40 ఇయర్స్ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడలు పక్కాగా వేస్తారని అంతా భావించారు. అలాగే జరిగింది. ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదని ఏపీ ప్రజలకు ఎప్పుడో తెలిసింది. ఒక్క పార్టీని వైసీపీని ఓడించే దమ్ము చంద్రబాబుకు లేదు. అందుకే.. ఢిల్లీకి వెళ్లి బీజేపీతో మంతనాలు ప్రారంభించారు. ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఆ మూడు పార్టీలు ఒక్కటవుతాయని.. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు కలిసి పోటీ చేసి వైసీపీని ఓడించేందుకు అన్ని రకాల పన్నాగాలు పన్నుతాయని వైసీపీ పార్టీ ముందే పసిగట్టింది. దానికి తగ్గట్టుగానే ఇంకా ఎన్నికలు రాకముందే ఇంకా ఎన్నికలు ఒక సంవత్సరం సమయం ఉందనగానే.. అప్పుడే పొత్తుల బేరం కుదుర్చుకుంటున్నాడు చంద్రబాబు.

ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వెనువెంటనే ఇద్దరినీ కలవడంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం లేచినట్టయింది. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పుడే వాళ్లను కలిసి పొత్తులపై చంద్రబాబు పలు ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తు ఉండాలని తెలంగాణ టీడీపీ నేతలు అధినేత దృష్టికి తీసుకురావడంతో ఏపీలో కూడా ఎందుకు పొత్తులు పెట్టుకోకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. అధికార వైసీపీ పార్టీని ఓడించడం ఒక్క టీడీపీ వల్ల కాదని తేలిపోయింది. కానీ.. వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఏపీలో ఒక్కటంటే ఒక్క వైసీపీ వెంట్రుక కూడా పీకలేరు.

tdp bjp and janasena alliance in next ap elections

tdp bjp and janasena alliance in next ap elections

YS Jagan : ఇన్ని రోజులు బీజేపీ ఎందుకు టీడీపీని పక్కన పెట్టినట్టు

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందిన విషయం తెలుసు కదా. 2019 ఎన్నికల ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు చంద్రబాబు. కానీ.. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ బీజేపీతో పొత్తు కోసం తెగ ప్రయత్నాలు చేశారు. కానీ.. బీజేపీ నేతలు చంద్రబాబును పక్కన పెట్టారు. అయినా కూడా చంద్రబాబు అప్పటి నుంచి అస్సలు వదల్లేదు. బీజేపీతో పొత్తుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరకు ఇప్పుడు ఆయనకు కేంద్రం నుంచి అపాయింట్ మెంట్ దొరికింది. దీంతో ఎగిరి గంతేస్తూ ఢిల్లీ వెళ్లారు. ఏపీలో అధికార వైసీపీని ఓడించడం కోసం బీజేపీ, టీడీపీ జతకట్టబోతున్నాయి. ఈ పొత్తుల మాటేమో కానీ.. అసలు చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది