Fish : ఇంట్లో చేపలు వండేటప్పుడు ఇలా ట్రై చేయండి.. నీచు వాసనే ఉండదు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Fish : ఇంట్లో చేపలు వండేటప్పుడు ఇలా ట్రై చేయండి.. నీచు వాసనే ఉండదు..!

Fish : చాలామందికి రెండు రోజులకి ఒకసారి నాన్ వెజ్ తినకపోతే ప్రాణం గుంజుతూ ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఎంతో ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉంటారు. వారంలో రెండు మూడు సార్లు నాన్వెజ్ ని ఇంట్లో వండుతూ ఉంటారు. అలా ఉండినప్పుడు ఇల్లంతా నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి సమస్యను దూరం చేయాలంటే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో చేపలు వండేటప్పుడు ఈ టిప్స్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Fish : ఇంట్లో చేపలు వండేటప్పుడు ఇలా ట్రై చేయండి.. నీచు వాసనే ఉండదు..!

Fish : చాలామందికి రెండు రోజులకి ఒకసారి నాన్ వెజ్ తినకపోతే ప్రాణం గుంజుతూ ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఎంతో ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉంటారు. వారంలో రెండు మూడు సార్లు నాన్వెజ్ ని ఇంట్లో వండుతూ ఉంటారు. అలా ఉండినప్పుడు ఇల్లంతా నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి సమస్యను దూరం చేయాలంటే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో చేపలు వండేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అయితే నీసు వాసన అంటూ ఉండదు. అవేమిటంటే.. అడ్జస్ట్ ఫ్యాన్: ఇంట్లో నాన్ వెజ్ అంటే చేపలు వండినప్పుడు దాని పొగ వాసన అధికంగా వచ్చినప్పుడు అడ్జస్ట్ ఫ్యాన్ వాడడం మంచిది. ఈ ఫ్యాన్ వాడడం వలన వాసన పోవడమే కాదు. పొగ కూడా ఇంట్లో ఉండదు. అప్పుడు చేపలు వాసన ఇంట్లో అనిపించదు..

Fish  వెనిగర్ వాటర్

అదేవిధంగా చేపలు ఫ్రై అవుతున్నప్పుడు ఓ ఫ్యాన్ లో నీరు పోసి మరిగించండి. అవి మరుగుతున్నప్పుడు రెండు మూడు చెంచాల వెనిగర్ కలపండి. ఇది వెంటనే గాలిలోని వాసనను దూరం చేస్తుంది.. దాల్చిన చెక్క పౌడర్: నాన్ వెజ్ వాసన దూరం చేయడంలో దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఇంటి నుండి మంచి వాసన వస్తుంది. వెనిగర్ నీటిలో దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు మీ దగ్గర ఏమైనా ఏషియన్ ఆయిల్ ఉంటే వాటిని కూడా వినియోగించండి. ఇది మీ వంటగదిని చక్కని పరిమళభరితంగా చేస్తుంది.

ఎయిర్ ఫ్రెషనర్స్: ఇంటి చిట్కాలు ఏమి పాటించడం ఇష్టం లేనివారు హెయిర్ ఫ్రెషర్స్ ఉపయోగించవచ్చు.. చేపలను వండిన వెంటనే ఇది వాడొద్దు. కాసేపు ఫ్యాన్ ఆన్ చేసి వినియోగించవచ్చు. ఈ పరిమళం ఫ్యాన్ నుండి వచ్చే గాలితో కలిపి మొత్తం ఇంటి నుండి చేపల వాసనను పోగొడుతుంది.

ఇలా క్లీన్ చేయండి: చేపలను వండిన తర్వాత వీలైనంత త్వరగా కిచెన్ ని శుభ్రం చేయండి. దీనివలన వాసన వెంటనే తగ్గిపోతుంది. స్టవ్ కౌంటర్ టాప్స్ క్లీన్ చేయడం వలన ఈ వాసన అనేది ఉండదు..
కాఫీ గింజల పొడి; ఓ గిన్నె వెనిగర్ కొద్దిగా గ్రౌండ్ కాఫీని కౌంటర్ టాప్ లో ఉంచితే వాసనలు ఇట్టే దూరమవుతాయి. వీటిని వేయించిన కూడా ఆ వాసనతో ఆ సమస్య పోతుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది