Perfect Pakundalu Recipe : వెన్నెలా కరిగిపోయే గోదారోళ్ళ సంక్రాంతి స్పెషల్ కొబ్బరి పాకుండలు..!!
Perfect Pakundalu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి గోదావరి వాళ్ళ సంక్రాంతి స్పెషల్ పాకుండలు. కోనసీమ, వైజాగ్ వరకు ఈ పాకుండలు ఎంతో ఫేమస్.. ఈ పాకుండలు సంక్రాంతికి కాకుండా అప్పగింతలలో అరిసెలు తో పాటు వీటిని కూడా సార గా ఇస్తూ ఉంటారు. ఇవి చూడ్డానికి చేయడానికి సేమ్ అరిసెల ప్రాసెస్ ఉంటుంది. కానీ దీని రుచి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం, బెల్లం, గసగసాలు, పచ్చికొబ్బరి, ఆయిల్, యాలకుల పొడి మొదలైనవి… దీని తయారీ విధానం : దీనికోసం ముందుగా కొత్త బియ్యం ఒక కేజీ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పై ఎండబోయాలి.
అంటే బియ్యం తడి పొడిగా ఉండాలి. తర్వాత వాటిని తీసుకొని పిండిగా పట్టుకోవాలి. తర్వాత పిండిని తీసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి. తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి దానిలో పావు కిలో బెల్లం వేసి పావుకప్పు నీళ్లు పోసి ముద్దపాకం వచ్చేవరకు కాగానివ్వాలి. పాకం ఉండలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపి దాన్లో ఒక పావు కప్పు గసగసాలు అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇక తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యప్పిండిని నాలుగు కప్పులు తీసుకొని కొంచెం కొంచెంగా పోస్తూ బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి.
ఇక తర్వాత దీనిలో అరిసెలకు వేసినట్టు నెయ్యి కానీ నూనె కానీ వేయకూడదు. తర్వాత ఒక ప్లేట్లో నెయ్యిని రాసుకొని చిన్న ఉండలుగా చేసుకునే ఆ ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ పెట్టి బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చేసుకున్న పాకుండలు అన్నిటిని వేసి కలపకుండా మూడు నిమిషాల పాటు ఉంచాలి. మూడు నిమిషాల తర్వాత గారెల పుల్లతో ఒకదానిని ఒకటి నెమ్మదిగా అడుగు నుంచి పైకి లేపాలి. అప్పుడు అవి పగలకుండా మంచిగా వస్తాయి. ముధురు బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ గా పాకుండలు రెడీ…