Sponge Dosa Recipe : చుక్క నూనె లేకుండా పెరుగు, వంట సోడా, ఈనో ఇవేమీ లేకుండా స్పాంజీ దోసలు, చట్ని…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sponge Dosa Recipe : చుక్క నూనె లేకుండా పెరుగు, వంట సోడా, ఈనో ఇవేమీ లేకుండా స్పాంజీ దోసలు, చట్ని…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :25 December 2022,7:40 am

Sponge Dosa Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి వంటసోడా ఈనో, పెరుగు అండ్ చుక్క నూనె కూడా లేకుండానే దూది లాంటి మెత్తటి స్పాంజి దోశల్ని ఎలా వేసుకోవచ్చు చూపించబోతున్నాను. అలాగే ఈ దోసలతో పాటు ఒక సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెసిపీ ని కూడా చూపిస్తాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా కనీసం ఒక్కసారైనా సరే ఇలా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి స్పాంజీ దోసల్ని , చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం రండి.. దీనికి కావాల్సిన పదార్థాలు : బియ్యం, మెంతులు, మరమరాలు, ఆవాలు, చింతపండు, టమాటాలు, ఎండు మిరపకాయలు, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా రెండు కప్పుల

బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి దానిలో ఒక స్పూను మెంతులు కూడా వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత పిండిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా రుబ్బుకోని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు కప్పుల మరమరాలను తీసుకుని వాటిని ఒకసారి తడిపి వాటిని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్టులా పట్టి మీ మిశ్రమాన్ని కూడా ముందుగా చేసుకున్న బియ్యపిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండి పై మూత పెట్టేసి రెండు మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి చట్ని తయారు చేసుకుందాం.. స్టవ్ పై ఒక పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ముందుగా పొట్టు తీసిన వెల్లిపాయలు ఒక ఐదేసి వేయించుకున్న తర్వాత ఐదు ఆరు ఎండుమిర్చి కూడా వేసి అవి కూడా ఏగిన తర్వాత దానిలో కొంచెం చింతపండు,

sponge dosa recipe with chutney in telugu

sponge dosa recipe with chutney in telugu

ఒక కప్పు టమాట ముక్కలను కూడా వేసి బాగా ఉడికించి తీసి బాగా చల్లారిన తర్వాత దానిని మిక్సీ వేసిటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసి మెత్తటి మిశ్రమంలో చేసుకోవాలి. తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఈ చట్నీకి పోపు వేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా దోషల మిశ్రమాన్ని మూత తీసి చూస్తే మంచిగా పొంగి ఉంటుంది. ఇక దాన్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దోసెల పిండి రెడీ అయిపోయింది. ఇక స్టవ్ పై దోశ పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటతోని దోస పిండి వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోసపై హోల్స్ వచ్చిన తర్వాత దానిపై మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా పెరుగు లేకుండా దోసలు రెడీ అయిపోయినట్లే.. వీటి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది