Fry Fish Recipe : చేపల ఫ్రై ని ఇలా మసాలా పట్టించి చేస్తే.. లొట్టలు వేసుకుంటూ తింటారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fry Fish Recipe : చేపల ఫ్రై ని ఇలా మసాలా పట్టించి చేస్తే.. లొట్టలు వేసుకుంటూ తింటారు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :30 December 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Fry Fish Recipe : చేపల ఫ్రై ని ఇలా మసాలా పట్టించి చేస్తే.. లొట్టలు వేసుకుంటూ తింటారు...!

Fry Fish Recipe : చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.. కానీ దీనిలో ముల్లులు ఉంటాయని పిల్లలు కొంతమంది పెద్దలు కూడా వీటిని ఇష్టపడరు.. అలాంటి వారు కూడా ఇప్పుడు తినేలా ఈరోజు ఫిష్ ఫ్రై ని టేస్టీగా ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను. ఈ ఫిష్ ఫ్రై ని ఒక్కసారి తిన్నారంటే తినని వాళ్ళు కూడా మళ్లీ మళ్లీ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ చేపల వేపుడు చేసేటప్పుడు తక్కువ నూనె వాడి చేపల ఫ్రై చేస్తే ఈ చేప ముక్కలు అనేవి పాన కి స్టిక్ అయిపోతూ ఉంటాయి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వాడితే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా నేను చూపించే ప్రాసెస్లో అండ్ నేను చెప్పే టిప్స్ ని యూస్ చేస్తూ కనుక చేస్తే ఈ ఫిష్ ఫ్రై ని జస్ట్ 2, 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యూస్ చేసి హాఫ్ కేజీ ఫిష్ పీసెస్ ని హ్యాపీగా ఫ్రై చేసుకోవచ్చు.అది కూడా క్రిస్పీగా చేసుకోవచ్చండి. ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం..

దీనికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, కాన్ ఫ్లోర్, మిర్యాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్, నిమ్మరసం మొదలైనవి… తయారీ విధానం; అరకేజీ దాకా చేప ముక్కలు తీసుకోవాలి.. ఈ చేప ముక్కలు అన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత వాటర్ తో వాష్ చేసుకోండి. వీటిని పల్చగా కనుక కట్ చేయించేస్తే ఫ్రై చేసేటప్పుడు బాగా డ్రై గా అయిపోతుందన్నమాట. మీడియం ముక్కల్ని కట్ చేయించుకోండి. ఇక్కడ అరకేజీ చేప ముక్కలు తీసుకున్నాం కదా.. ఫిష్ ఫ్రై మసాలా కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి.. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు, ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాక జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేయండి.

నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి, ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఆరబద్ద నిమ్మ చెక్కరసాన్ని ఇందులో పిండేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కాన్ ఫ్లోర్ వేయండి. ఈ కాన్ ఫ్లోర్ వేయడం వల్ల మసాలా అంతా కూడా ఫిష్కి బాగా పడుతుంది. అండ్ పైన లైట్ క్రిస్పీ నెస్ అనేది యాడ్ అవుతుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసి బాగా మిక్స్ చేయండి. ఫిష్ ఫ్రై కోసం మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఈ మసాలాను చేప ముక్కలకు అన్ని వైపులా కూడా లోపల వైపు పైన అంతా కూడా అప్లై చేయండి. ముక్కలకి మసాలా అంతా కూడా పట్టించేసిన తర్వాత ఈ ప్లేట్ ఫ్రీజర్ లో ఒక వన్ అవర్ పాటు ఉంచండి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ ని ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి.

ఇందులో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని పాన్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఫ్యాన్ కి ఎన్ని పడతాయో అన్ని చేప ముక్కల్ని వేసుకోండి. మూడు లేదా నాలుగు చేప ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. కొంచెం వేగిన తర్వాత గ్యాప్ ఇస్తూ తిప్పండి. ఫిష్ పీసెస్ ఈజీగా టర్న్ అవుతాయన్నమాట. ముక్కలు విరిగిపోకుండా చక్కగా టర్న్ అవుతాయి. ఇలా మనం క్రిస్పీగా అయ్యేంతవరకు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం పెట్టి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ తిప్పుతూ చేప ముక్కలన్నీ కూడా ఈవెన్గా వేగేంత వరకు బాగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు వేగిన తర్వాత ఇలాగే మొత్తం ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా హ్యాపీగా ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా తక్కువ నూనెలో పాన్ కి స్టిక్ అయిపోకుండా మసాలా విడిపోకుండా టేస్టీగా ఫిష్ ఫ్రై ని చేసేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ లో ఈ మసాలాతో ఈ విదంగా ఈ టిప్స్ తో ఫిష్ ఫ్రై ని ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. తినని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తింటారు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది