Natu Kodi Recipe : నాటుకోడి కూరలో ఇలా మసాలా కొట్టి చేస్తే.. దీని టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది… వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Natu Kodi Recipe : నాటుకోడి కూరలో ఇలా మసాలా కొట్టి చేస్తే.. దీని టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది… వీడియో !

Natu Kodi Recipe : ఈరోజు నాటుకోడి పులుసుని పక్క విలేజ్ స్టైల్ లో ఎలా చేసుకోవచ్చు తెలుసుకోబోతున్నాం.. ఈ చికెన్ కర్రీ లోకి మనము ఒక అద్భుతమైన మసాలాని తయారు చేస్తున్నాం. ఈ మసాలాతో నాటుకోడి కూర చేసినా కూడా ఈ గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాటుకోడి పులుసు స్పెషల్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు: నాటుకోడి చికెన్, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర, […]

 Authored By jyothi | The Telugu News | Updated on :3 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Natu Kodi Recipe : నాటుకోడి కూరలో ఇలా మసాలా కొట్టి చేస్తే.. దీని టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది...!

Natu Kodi Recipe : ఈరోజు నాటుకోడి పులుసుని పక్క విలేజ్ స్టైల్ లో ఎలా చేసుకోవచ్చు తెలుసుకోబోతున్నాం.. ఈ చికెన్ కర్రీ లోకి మనము ఒక అద్భుతమైన మసాలాని తయారు చేస్తున్నాం. ఈ మసాలాతో నాటుకోడి కూర చేసినా కూడా ఈ గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాటుకోడి పులుసు స్పెషల్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు: నాటుకోడి చికెన్, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, గరం మసాలా, ఎండు కొబ్బరి, ఉప్పు, కొత్తిమీర, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొదలైనవి… తయారీ విధానం; ఫస్ట్ దీని కోసం క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న మీడియం సైజ్ లో ఉండే నాటుకోడి ముక్కలు కేజీ దాక తీసుకోవాలి.ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లోకి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఈ చికెన్ ముక్కలు అన్నిటికి కూడా బాగా పట్టించాలి. ఇలా పట్టించి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పావు ఎండు కొబ్బరి ముక్కని తీసుకుని సన్నటి సగం మీద బాగా కాల్చుకుని చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మసాలా పేస్ట్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై మట్టికుండను పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల పల్లీలు, రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒకటి బిర్యానీ ఆకు, ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసి కొద్దిగా ఫ్రై చేసి ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయాక తర్వాత ఒక టీ స్పూన్ దాకా గసగసాలు కూడా వేసి స్టవ్ ఆపేయండి.

ఆ వేడికి గసగసాలు జీలకర్ర చక్కగా వేగిపోతాయి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి అలాగే ఫ్రై చేసుకున్న ఈ మసాలా దినుసులు అన్నిటిని కూడా మిక్సీ జార్ లో వేసుకుని ఫైన్ పౌడర్ల గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసి వీలైనంత ఫైన్ పేస్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. మనకి మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది.దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కుండలో కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచ్ దాల్చిన చెక్క, మూడు లవంగ మొగ్గలు, ఒక అనాసపువ్వు, అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వీటిని వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి లైట్ గా వేగాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయలు ఒక కప్పు నిండుగా తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చి ఆయిల్ పైకి తేలేంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ అనేది 50, 60% దాకా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు అనేవి సగం పైనే ఉడికిపోయాక రెండు లేదా మూడు పచ్చిమిర్చి తీసుకుని చీల్చుకుని ఆడ్ చేసుకోండి.

అలాగే ఒక మీడియం సైజు ఉండే టమాటా ని ఫైన్ పేస్టులా ప్యూరీ ల తయారు చేసుకుని ఆ టమాటా పేస్ట్ ని కూడా వేసేసుకోండి. అండ్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం కొద్దిగా కరివేపాకు కూడా వేసేసేయండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. కొంచెం సేపు ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ అనేది వేగాలి. ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కప్పు దాకా నీళ్లు వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఈ చికెన్ ముక్కలు అనేవి మెత్తగా సాఫ్ట్ గా ఉడికిపోయేంత వరకు కూడా లోఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అదే మీరు కుక్కర్లో ఉడికించినట్లయితే నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్క చేసుకోండి. చాలా త్వరగా ఈజీగా ఉడికిపోతుంది. ఆయిల్ పైకి తేలి ముక్క మెత్తగా ఉడికిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. స్టవ్ ఆపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లేసుకొని పక్కకు దించేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి. నాటుకోడి పులుసు అండ్ మంచిగా గ్రేవీ రెడీ. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది