Health Alert : దగ్గు సిరప్ వలన గుండె ఆగిపోయిన రెండు సంవత్సరాల చిన్నారి… అసలేమైందంటే.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Alert : దగ్గు సిరప్ వలన గుండె ఆగిపోయిన రెండు సంవత్సరాల చిన్నారి… అసలేమైందంటే.?

Health Alert : చాలామంది చిన్నపిల్లలకు జలుబు, దగ్గు సమస్యలకు సిరప్ లోను డాక్టర్ సిఫారస్ చేయకుండా వాడుతూ ఉంటారు. అయితే నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకి దగ్గు మందులను సూచించలేదని తెలియజేశారు. కొన్ని సందర్భాలలో దగ్గు సిరప్ అవసరం ఉండదని డాక్టర్లు చెప్పారు. అయితే ముక్కు కారడం దగ్గును వెచ్చని కంప్రెస్ తో చికిత్స పొందవచ్చని తెలియజేశారు. చాలామందిలో గోరింత దగ్గు అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. మారుతున్న వాతావరణం వల్ల చిన్న పిల్లలు ఇవి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :23 December 2022,7:00 am

Health Alert : చాలామంది చిన్నపిల్లలకు జలుబు, దగ్గు సమస్యలకు సిరప్ లోను డాక్టర్ సిఫారస్ చేయకుండా వాడుతూ ఉంటారు. అయితే నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకి దగ్గు మందులను సూచించలేదని తెలియజేశారు. కొన్ని సందర్భాలలో దగ్గు సిరప్ అవసరం ఉండదని డాక్టర్లు చెప్పారు. అయితే ముక్కు కారడం దగ్గును వెచ్చని కంప్రెస్ తో చికిత్స పొందవచ్చని తెలియజేశారు. చాలామందిలో గోరింత దగ్గు అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. మారుతున్న వాతావరణం వల్ల చిన్న పిల్లలు ఇవి ప్రభావితమవుతూ ఉంటాయి .వాటి వలన వారికి దగ్గు, జలుబు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది మొదటగా దగ్గు సిరప్ వాడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనదని చాలామందికి తెలియదు.

అటువంటి ఒక దగ్గు సిరప్ తాగిన 30 నెలల పాప గుండె ఆగిపోయిన షాకింగ్ సంఘటన ముంబైలో జరిగింది. ఈ సిరప్ తీసుకున్న 20 నిమిషాల తర్వాత చిన్నారి గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోయింది.. ముంబైకి చెందిన పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ మంగేష్కర్ 2 సంవత్సరాల మనవడు డిసెంబర్ 15న దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతుండగా.. దాంతో వారు చిన్నారికి ఒక బహుళ జాతి కంపెనీకి చెందిన దగ్గు మందు ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ సిరప్ ఇచ్చిన 20 నిమిషాల తర్వాత చిన్నారి ఒక్కసారిగా పడిపోవడం జరిగింది. ఆ తదుపరి అతని గుండె చప్పుడు కూడా కొట్టుకోవడం ఆగిపోయింది. దాంతో చిన్నారి ఊపిరి తీసుకోలేక పోయింది. ఇక దాంతో ఆ చిన్నారి తల్లి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

A two year old girl suffered cardiac arrest from cough syrup

A two-year-old girl suffered cardiac arrest from cough syrup

అక్కడ చిన్నారి కి హుటాహుటిన సిపిఆర్ అందించారు. ఆ తర్వాత పాప కళ్ళు తెరిచి రక్త పోటు గుండె వేగం పెరగడానికి దాదాపు 20 నిమిషాల వరకు సమయం పట్టిందని వైద్యులు తెలపడం జరిగింది.
ఈ సంఘటనపై బిడ్డ తల్లి చెప్తూ ఘటన జరిగిన తర్వాత పలు రకాల టెస్టులు చేయడం జరిగింది. దీనికి కారణం దగ్గు వాడిన మందు అని చెప్పారు. ఈ డ్రగ్స్ లో క్లోరోఫినిట్ అనే సమ్మేళనాలు ఉన్నట్లు క్లినికల్ ట్రైలర్ లో బయటపడింది. ఈ నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ మందులను అస్సలు వాడకూడదు. ఎఫ్ డి ఏ నిషేధించడం జరిగింది. అయితే ఈ ఔషధాన్ని అటువంటి లేబుల్ దీనిలో లేదు వైద్యుల్ని వారి రోగులకు సూచిస్తారు. మరోవైపు దగ్గు సిరప్ కార్డియాక్ అరెస్టుకు కారణమైందని చెప్పారు.

Also read

Tags :

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది