Health Problems : వీళ్లు వాము అస్సలు తీసుకోకూడదు.. వాటిపై దీని ప్రభావం ఎక్కువ
Health Problems : వాము ప్రతి వంటింట్లో మసాలా దినుసులతో పాటు మనకు కనిపిస్తుంది. వాము అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పలు ఔషదాల తయారీలో కూడా వామును ఉపయోగిస్తారు. వాము గ్యాస్, అజీర్తి సమస్యలను నివారిస్తుంది. అలాగే జలుగు, దగ్గు నుంచి ఉపషమనం పొండానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. వామును డైరెక్ట్ గా నమలడం గానీ, నీళ్లతో కలిపి తీసుకుంటారు. గొంతు సమస్యలు, విషజ్వారాలను కూడా తగ్గించడంలో కూడా సహాయపడతుంది. వాము రుచి కారంగా, ఘాటుగా ఉంటుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, హైబీపీ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు
వామును వాడితే వెంటనే ఉపషమనం లభిస్తుంది.వాములో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, సీ, ఈ, కే లతోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్ఫరస్ తదితర పోషకాలు కూడా వాములో ఉంటాయి. అందువల్ల మనకు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి వాము ఉపశమనాన్ని ఇస్తుంది. వాములో ఉండే థైమిన్ అనే రసాయనం యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసి ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. దీంతో చాలా మంది వామును డైరెక్ట్ గా కాని ఫుడ్ ద్వారా తీసుకుంటారు. వాటర్ లో కూడా కలుపుకుని తాగవచ్చు.అయితే వాము అనేక ఆనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
కానీ మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్, మంట నుంచి ఉపషమనం పొందడానికి చాలామంది వాము ను ఎక్కువగా తీసుకుంటారు. దీని వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే గర్భిణులు వామును తీసుకోకపోవడమే మంచిది. అలాగే వేడి ఎక్కువగా ఉండేవారు కూడా వామును ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు.అలాగే ఎలర్జీ ఉన్నవారు కూడా వామును ఎక్కువగా తీసుకోకూడదు. దీనివల్ల వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా వామును డైరెక్ట్ గా అతిగా తీసుకుంటే నోటిలో మంట, పుండ్లు అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వామును అవసరం మేరకే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.