Health Benefits : మలబద్ధకాన్ని తగ్గించే చియా విత్తనాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Health Benefits : ప్రస్తుతం కాలంలో చాలా మంది పాలిష్ చేసిన ఆహారాలు, రిఫైన్డ్ చేయబడిన పదార్థాలనే ఆహారంగా తీసుకుంటున్నారు. దీని వల్ల ప్రేగుల్లో పీచు పదార్థాలు లేక మలబద్ధకం కల్గుతుంది. చాలా మందికి మనం రోజుకు ఒక సారి అవుతుంది. అది కూడా చాలా బలవంతంగా వెళ్తే అవుతుంది. కొంత మందికి వచ్చే ఆ మలం కూడా రెండు, మూడు రోజులకు ఒకసారి అవుతుంది. వచ్చినప్పుడు కూడా గట్టిగా, గోళీలు లాగా వస్తూ తెగ నొప్పిని కల్గిస్తుంటుంది. ఇలాంటి వారికి ప్రతి రోజూ సులభంగా విరేచనం అవ్వడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.చియా విత్తనాలు.. అచ్చం సబ్జా గింజల్లానే కనిపిస్తుంటాయి. కానీ సబ్జా గింజల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి.
ఈ విత్తనాలను 100 గ్రాములు తీసుకుంటే అందులో 33.4 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. ఏ ఆహార పదార్థాల్లోనూ ఇన్ని పీచు పదార్థాలు ఉండవు. వీటిని సులువుగా తీసుకునే పద్ధతి తెలుసుకుంటే వీటి ద్వారా మల బద్ధకం నుంచి విముక్తి పొందవచ్చు. నీటిని ఎక్కువగా తీసుకున్న అతర ఆహార పదార్థాలు తీసుకున్నా ఆశించిన విధంగా సుఖ విరేచనం అవ్వదు. కానీ ఈ చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. 100 గ్రాముల చియా సీడ్స్ 486 క్యాలరీస్ శక్తిని కల్గి ఉంటాయి. ఇవి కోడి లేక మేక మాంసం కంటే నాలుగ వంతుల క్యాలరీస్ ను ఎక్కువగా కల్గి ఉంటాయి. వీటని నానబెట్టుకొని ఉపయోగించుకోవాలి.ఎండ వాటిని తీసుకోవడం ద్వారా అవి త్వరగా జీర్ణం కావు.కనుక వీటిని ముందు రోజు రాత్రి నీళ్లలో వేసుకొని నానబటెటాలి.
ఇలా తీసుకోవడం ద్వారా కడుపులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరియు సుఖ విరేచనం జరుగుతుంది. ఇలా నానబెట్టుకున్న గ్లాస్ నీటిలో తేనె మరియు నిమ్మరసం కలిపి తీసుకోవడం ఒక పద్ధతి. ఇలా నానబెట్టిన విత్తనాలను వెజిటేబుల్ సలాడ్ లో లేక సూప్స్ లో, ఫ్రూట్స్ పై డ్రెస్సింగ్ గా ఉపయోగించుకోవచ్చు. కనీసం ఈ గింజలను ఐదారు గంటలు నానబెట్టుకోవాలి. కొంత మంది వీటిని పాలల్లో కలుపుకొని తాగుతారు. ఇంకా ఓట్స్ తో పాటు కూడా కలిపి తీసుకుంటారు. ఈ నాన పెట్టిన చియా గింజలు నీటిని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ప్రేగుల్లో ఒక చీపురు కట్ట వలే పనిచేస్తాయి. వీటిలో గల పీచు పదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమై విరేచనం సులభంగా, లూజ్ గా అయ్యేలా చేస్తుంది. అంతే కాకుండా చియా సీడ్స్ అనేకమైన అనారోగ్యాలు రాకుండా కాపాడతాయి.