Health Benefits : ఎందులోనూ లేని లాభాలు వేప ఆకుల్లో ఉన్నాయి. అవేంటో తెలిస్తే అస్సలే వదిలిపెట్టరు..
Health Benefits : వేప ఆకులను సర్వ రోగ నివారిణి అని అంటారు. ఆయుర్వేధంలో విరివిగా వాడే ఆకుల్లో వేప ఆకులు ముందు వరుసలో ఉంటాయి. వేపకు అంతటి ప్రాధాన్యం ఉంది. వేప లోని చేదు గుణం మనలోని చాలా రోగాలను దూరం చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. వేప ఆకులతో చేసే రసం లేదా జ్యూస్ తాగితే కడుపంతా పరిశుభ్రం అవుతుంది. మలినాలన్నీ మలం ద్వారా బయటకు వెళ్లి పోతాయి. వేప పండ్లను తిన్నా దాదాపు ఆకులను తిన్న ఫలితమే వస్తుంది. అయితే వేప చేదుగా ఉండటం వల్ల చాలా మంది దీనిని తినడానికి ఇష్ట పడరు. కానీ ఎక్కడైతే మంచి ఉంటుందో.. అది కొద్దిగా కఠినంగానే ఉంటుందని గమనించాల్సి ఉంటుంది.
పరగడుపున వేక ఆకులను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వేపలోని చేదు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. అనేక రకాల శారీరక రుగ్మతలను తగ్గించడంలో వేప ఎంతో ముఖ్యమైన పాత్రర పోషిస్తుంది.వేప ఆకులు ముఖంపై వచ్చే మొటిమలను తొలగిస్తాయి. గాయాలను కూడా త్వరగా నయం చేస్తుంది వేప. మొటిమలు, గాయాల నొప్పులను వేప ఆకు పేస్ట్ లాగా చేసి దానిని ఆ గాయాలపై రాస్తే ఉపశమనం పొందవచ్చు. గాయం త్వరగదా నయం అవుతుంది.వికారం, దురద లేదా దద్దుర్లు లేదా ఇతర చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వారు రోజూ చేదు వేప ఆకులను తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. వేపలోని చేదు రోగ నిరోధకతను పెంచి… వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ లపై పోరాడేలా చేస్తుంది.
దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు, దురద, దద్దుర్లు లాంటివి ఇట్టే నయం అయిపోతాయి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అస్సలే ఉండవు.వేప ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల కడుపులోని పురుగులు నశిస్తాయి. బిట్టర్ ఫ్లూ జ్వరం, ఇతర వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఇలా తరచూ తాగితే రాబోయే చాలా రోగాలు కూడా దరిచేరవు.వేప పుల్లలతో దంతాలను శుభ్రపరచడం వల్ల నోటి దుర్వాసన, పలు సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.వేప ఆకుల రసం తాగినా.. నీళ్లతో నాన బెట్టి తాగినా కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.మధుమేహంతో బాధపడేవారికి వేప ఆకులు ఔషధంలా పని చేస్తాయి. వేప ఆకులను రోజూ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.