Health Benefits : అంజీర్ తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
Health Benefits : అంజీర్ లేదా డ్రై అత్తిపండు గురించి తెలియని వారుండరు. శరీరంలో రక్తపు నిల్వలను పెంచే ఈ అంజీర్ మల్బరీ కుటుంబానికి చెందిన రుచికరమైన డ్రైఫ్రూట్. ఇది చూడటానికి గుండ్రంగా ఉంటుంది. అలాగే ఈ పండును తినేటప్పుడు మధ్యలో ఉండే కొన్ని క్రంచీ విత్తనాలు పళ్లకు తగులుతూ మరింత రుచిని పెంచుతాయి. అయితే ప్రతిరోజూ రాత్రి 1 లేదా 2 అంజీర్ పండ్లను సగం కప్పు నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయమే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. అలాగే బాదం, వాల్ నట్స్ తో పాటు మరికొన్ని గింజలను నానబెట్టుకొని తినాలి. నానబెట్టిన అంజీర్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అంజీర్ పండులో జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండి… స్త్రీ, పురుషులలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే అంజీర్ లో ఉండే ఫైబర్ వల్ల హార్మోన్ల అసమతుల్యత, రుతు క్రమం ఆగిన సమస్యల నుంచి రక్షణను ఇస్తుంది. పీఎంఎస్ సమస్యలతో వ్యవహరించే మహిళలు లక్షణాలను తగ్గించడానికి అత్తి పండ్లను తినాలని కూడా సూచిస్తున్నారు. అలాగే అంజీర్ లో ఉండే పొటాషియం వల్ల శరీరంరోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నానబెట్టిన అంజీర్ తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.

anjeer dry fruit health benifits
అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్లు ప్రతీ రోజూ అంజీర్ ను తినవచ్చు. అంతే కాకుండా అత్తి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త పోటు స్థాయిలను తనిఖీ చేస్తూ శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొరేవరూ ధనవపల వురేధీవివు నివారించడం ద్వారా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ట్రై గ్లిజరైస్డ్ స్థాయిని తగ్గించడానికి అత్తి పండ్లు ఉపయోగపడాతియ. అలాగే సరైన మోతాదులో కాల్షియాన్ని ఇవ్వడంలో కూడా అంజీర్ పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన శరీరాలు కాల్షియంను సొంతంగా ఉత్పత్తి చేయవు. అందువల్ల మనం పాలు, సోయా, ఆకు కూరలు మరియు అత్తిపండ్లు వంటి ఆహార పదార్థాలపై ఆధార పడాలి.