TEA – Coffee : చలికాలంలో టీ ,కాఫీలు తాగడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా…? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
TEA – Coffee : సహజంగా చాలామంది ఉదయం లేవగానే టీ కాఫీలు తాగకుండా ఏ పని మొదలుపెట్టారు.. ఈ టీ కాఫీలు తాగడం వలన శరీరానికి యాక్టివ్ నెస్ వచ్చి ఎంతో హుషారుగా పనిచేస్తూ ఉంటారు.. కొంతమంది అయితే టీ కాఫీలు అంటే ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే కొందరు ఆరోగ్య నిపుణులు టీ, కాఫీలు అధికంగా తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. అయితే చలికాలంలో టీ, కాఫీలు తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టీ కాఫీలు తాగడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం..
*టీ కాఫీలలో కేఫిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. దీని తాగడం వల్ల మైండ్ రిలాక్స్ అయ్యి మెదడులో నరాలు ఉత్తేజానికి గురవుతుంటాయి…
*అయితే ఉదయం లేవగానే ఒక కప్పు టీ, కాఫీలు తాగితే చాలు.. ఆ రోజంతా ఎంత ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు..
*అయితే ఈ టీ కాఫీలు చలికాలంలో తాగడం వలన జలుబు, దగ్గు గొంతు ఇన్ఫెక్షన్లు రావని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..
*చలికాలంలో వేడి టీ తాగడం వల్ల శరీరం త్వరగా చల్లబడదు. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు..
*చలికాలంలో శరీరం కొంచెం బద్దకిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రతిరోజు టీ,కాఫీలు తాగడం వల్ల సోమరితనం, బద్ధకం నిద్రను తమ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు…
*చలికాలంలో టీ తాగడం వలన వేడిగా గొంతు ద్వారా కడుపులోకి వెళ్లిన టీ, కాఫీలు నరాలను ఉత్తేజ పరుస్తాయి..
*అలాగే ఈ చలికాలంలో అల్లం టీ తీసుకుంటే విశ్రాంతిని ప్రశాంతను కలిగిస్తుంది..
*ఆయుర్వేద మూలికలు టీ పొడిలో ఉండడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే ఫ్రీ మోషన్ జరగడమే కాకుండా కడుపులోని వికారం సమస్యకు ఉపశమనం కలుగుతుంది…