Black Tea : ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగుతున్నారా.. అయితే ఈ ప్రమాదకరమైన వ్యాధులు తప్పవు..!
Black Tea : చాలామంది బెడ్ మీద ఉండగానే టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. ఈ టీ కాఫీలు తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. అయితే చాలామంది రకరకాల టీలను తాగుతూ ఉంటారు. కొందరు బ్లాక్ టీ తాగుతూ ఉంటారు. ఉదయం బ్లాక్ టీ తాగితే కొన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
బ్లాక్ టీ తాగడం మంచిది కాదు అని కూడా చెప్తున్నారు. ఎందుకనగా బ్లాక్ టీ తాగితే ఎన్నో వ్యాధులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగడం వలన ఈ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Black Tea : కడుపుబ్బరం
బ్లాక్ టీ తాగడం వలన గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. ఇది క్రమేపి వాత సమస్యను కలిగిస్తూ ఉంటుంది. దాని ఆమ్ల ప్రభావం మూలంగా ఎన్నో అనారోగ్యం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Black Tea : మలబద్ధకం
శరీరంలో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మలబద్ధకం కూడా వస్తుంది. తిన్న ఆహారం పేగులలో సరిగా జీర్ణం అవ్వకపోతే మలవిసర్జన ప్రక్రియలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి.
బ్లాక్ టీ అమ్లత్వం కలిగి ఉంటుంది. కావున ఖాళీ కడుపుతో త్రాగడం వలన ఆమ్ల ప్రభావం పెరుగుతుంది. ఇది దంతాల ఉపరితల ఎనామిల్ను దెబ్బతీస్తూ ఉంటుంది.
Black Tea డిహైడ్రేషన్
బ్లాక్ టీలో తియో ఫిలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో డీహైడ్రేషన్ కి కారణం అవుతూ ఉంటుంది. దీనిని రోజు తాగే అలవాటు ఉన్నవాళ్లకి ఇది ఇబ్బందికరంగా మారుతుంది.
Black Tea : అజీర్ణ సమస్య
బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఆమ్ల ప్రభావాన్ని కలిగి ఉండడం వలన ఇది ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన శరీరం ఆసిడ్ ఆల్కలిన్ బ్యాలెన్స్ దెబ్బతీస్తుంది. ఇది రోజు గడుస్తున్న కొద్ది ఎస్డిటి లేదా అజీర్తి పెరిగేలా చేస్తుంది.
Black Tea ఈ బ్లాక్ ఎప్పుడు తీసుకోవాలి
బ్లాక్ టీ తాగాలనిపిస్తే దీని ఫలితాలను పొందడానికి భోజనం చేసిన తర్వాత తీసుకోవడం మంచి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.