Protein Food : ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా… శరీరంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా….?
ప్రధానాంశాలు:
Protein Food : ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా... శరీరంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా....?
Protein Food : ప్రోటీన్ పదార్థం అనేది శరీరానికి చాలా అవసరమైనది. కానీ అధిక మోతాదుల్లో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. ఏదైనా సరే ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పి, మితంగా తీసుకోవలసిన ఆహారాన్ని, అమితంగా తీసుకుంటే అది విషయంగానే మారుతుంది. అయితే శరీర బరువుకు తగిన మోతాదులో ప్రోటీన్లను తీసుకోవాలి. రోటీల్లో అధికంగా తీసుకుంటే దాహం,తలనొప్పి, మల బద్ధకం,నీరసత, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది మూత్రపిండాలపై అధిక భారం వేస్తుంది. అయితే గుడ్లు, చికెన్, రొయ్యలు వంటి ఆహారాలు శరీరంలో వేడి పెంచి ఒంటి నొప్పులు కలిగిస్తాయి.ప్రోటీన్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. కాని దీని ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తేవడం కాయం. అయితే ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకాల్లో ఒకటి. కండరాల నిర్మాణం, కణాల మరమ్మత్తు, శక్తి సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల ప్రోటీన్ ని అధికంగా తీసుకుంటే ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. జిమ్ము కారణంగా లేదా డైట్ కారణంగా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మాత్రం ఈ సమస్య ఎక్కువగానే కనిపిస్తుందని చెబుతున్నారు. ప్రతి వ్యక్తి కూడా శరీర ఆరోగ్య తగినంత ప్రోటీన్ ను మాత్రమే తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Protein Food ప్రోటీన్ ను లిమిటెడ్ గా తీసుకోకుంటే
మన శరీర బరువును బట్టి రోజుకి 1 kg కి 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. దీనికంటే అధికంగా ప్రోటీన్ ని తీసుకుంటే విష పదార్థంగా మారి అనే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలు అధికంగా పనిచేయాల్సి వస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉన్న పదార్థాన్ని కిడ్నీలు ఫిల్టర్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు ఇవి చాలా కష్టమవుతుంది.దిని ఫలితంగా శరీరం నీరసిస్తుంది.
Protein Food తీవ్రమైన దాహం :
ప్రోటీన్స్ ఉన్న పదార్థం అధికంగా తీసుకుంటే శరీరముకు గురై నీటి అవసరం పెరుగుతుంది. వల్ల ఎక్కువగా దాహం వేయడమే కాకుండా తాగిన నీరు కూడా శరీరానికి సరిపోదు. పరిస్థితి శరీరాన్ని బలహీన పరుస్తుంది. తద్వారా ఒంటిలో తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇటువంటి యొక్క సమస్య ప్రోటీన్ ని అధికంగా తీసుకున్న వారిలో కనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Protein Food నోటి దుర్వాసన :
రోటి నదికంగా తీసుకునే వారికి నోటి నుంచి దుర్వాసన సమస్య కలగటం సహజమే. ప్రోటీన్ డైజెస్టివ్ అయినప్పుడు రెండు రకాల ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి నోటిలో తీవ్రమైన దుర్వాసనను కలిగిస్తాయి. ఈ సమస్యను తగ్గించుకొనుటకు ఎక్కువగా వాటర్ ని తాగాల్సి ఉంటుంది.
మలబద్ధకం,జీర్ణక్రియలో సమస్యలు :
ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మలబద్ధకం ఎక్కువగా ఎదురవుతుంది. అలాగే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య మరింత తీవ్రతరం గా మారుతుంది. కాబట్టి ప్రోటీన్ ఆహారంతో పాటు సరైన మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవడం చాలా మంచిది.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు :
చేపలు, గుడ్లు, మటన్, చికెన్, పాలు, పెరుగు, చీజ్,బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, బీన్స్,శనగలు వంటి ఆహారాల్లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి తగినంత మోతాదుల్లో తీసుకుంటే శరీరానికి మేలు చేస్తాయి. మరి అధికంగా తీసుకుంటే మాత్రం పలు సమస్యలు తలెత్తుతాయి.
ఒoటి నొప్పులు, వేడి ప్రభావం :
చికెన్,గుడ్లు,రొయ్యలు వంటి ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాలు శరీరానికి వేడిని కలగజేస్తాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఒoటి నొప్పులు, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల ప్రోటీన్ తో కూడిన ఆహారాన్ని సమతులంగా తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్ శరీరానికి ఎంతో ముఖ్యమైన పోషకం అయినప్పటికీ, దీనిని లిమిటెడ్ గా తీసుకోవడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది.