Arjuna Bark : అర్జున బెరడులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా…!
ప్రధానాంశాలు:
Arjuna Bark : అర్జున బెరడులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...!
Arjuna Bark : ఆయుర్వేదంలో ఎన్నో చెట్లు మరియు మొక్కలు వాటి ప్రయోజనాల గురించి తెలిపారు. ఈ చెట్లు అధిక భాగం అడుగులోనే కనిపిస్తాయి. వాటి బెరడు నుండి ఆకుల వరకు కూడా ఎన్నో సమస్యలకు ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో అర్జున బెరడు కూడా ఒకటి. అయితే ఈ అర్జున వృక్షాన్ని మీరు కచ్చితంగా చూసే ఉంటారు. కానీ ఈ చెట్టు లో ఉన్న ఔషధ గుణాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అర్జున బెరడులో ఆయుర్వేద ఔషధంగా కూడా పరిగణిస్తారు. ఇది ఎన్నో రకాల సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇది గుండె బ్లాక్ లను తొలగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక షుగర్ తో బాధపడే వారికి కూడా అద్భుతమైన మూలికగా చెప్పొచ్చు. అర్జున బెరడులోని ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా గొప్ప ఔషధంగా కూడా చెబుతారు.
అర్జున మొక్క అనేది ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. అందువలన దీనిని ఋగ్వేదంలో కూడా ప్రస్తవించారు. అర్జున బెరడు అనేది శరీరాన్ని ఎన్నో సమస్యల నుండి రక్షిస్తుంది. అర్జున బెరడు వాడకం వలన గుండెకు సంబంధించిన సమస్యలను కూడా దివ్య ఔషధం లాగా పని చేస్తుంది. హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్,హార్ట్ ఫెయిల్యూర్ లాంటి ఎన్నో గుండెకు సంబంధించిన సమస్యలకు అర్జున బెరడు ఉపయోగం, దాని ప్రయోజనాలపై ఇప్పటిదాకా ఎన్నో అధ్యయనాలు జరిగాయి. ఆయుర్వేదంలో కషాయాల రూపంలో వాడే ప్రస్తావన ఉన్నది. ఈ అర్జున బెరడులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. శరీరంలో కూడా ఎన్నో రకాల సమస్యలను దూరం చేస్తుంది అని తెలిపారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంతో పాటుగా SDL స్థాయిలను కూడా పెంచుతుంది.
హార్ట్ బ్లాక్ బాధితులో సమస్యలను తొలగించడంలో కూడా ఈ బెరడు కషాయం అనేది ఎంత దోహదం చేస్తుంది. అంతేకాక ఇది శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతుంది. ఇది చక్కెరను కూడా అదుపులో ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా వ్యాధిల నుండి కూడా రక్షిస్తుంది. అర్జున బెరడు ఒక చిన్న ముక్కను తీసుకొని రాత్రంతా నీళ్లలో నానబెట్టుకొని ఉదయం లేవగానే దానిని మరిగించి వడకట్టి తాగాలి. ఈ అద్భుత కషాయాన్ని ప్రతిరోజు తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అర్జున బెరడు అనేది గొంతు ఇన్ఫెక్షన్ పోగొట్టడంలో కూడా ఎంతో ప్రభావితంగా పని చేస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అర్జున టాబ్లెట్లు మరియు పౌడర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి..