Winter Tips : చలికాలంలో ఈ సమస్య వస్తే … ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే .. జాగ్రత్త పడకపోతే ఇక అంతే !
Winter Tips : చలికాలంలో చాలామంది కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు తమని తాము నిత్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆస్తమా రోగులు చలికాలంలో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతారు. కొన్నిసార్లు ఈ సమస్య ప్రాణాంతకంగా కూడా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆస్తమా వ్యాధిలో శ్వాసకోశ గొట్టాలలో వాపు ఉంటుంది. దీని కారణంగా శ్వాస మార్గం ఇరుకుగా, చిన్నదిగా మారుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. దీంతోపాటు దగ్గు సమస్య కూడా మొదలవుతుంది.
ఛాతిలో నొప్పి, గురక, చాతిలో బిగుతూ ఉండడం వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. ప్రపంచంలో దాదాపు 235 మిలియన్ల మంది ఆస్తమా బారిన పడుతున్నారు. ఇందులో ఎక్కువగా యువత ఆస్తమా బారిన పడుతున్నారు. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ. కలుషితమైన గాలి ఊపిరితిత్తులను పాడు చేస్తుంది. ఆస్తమా రోగులు పొరపాటున కూడా కాలుష్యం ఉన్న ప్రదేశానికి వెళ్లకూడదు. కాలుష్యం ఎక్కువగా ఉంటే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు.
ఉబ్బసానికి గల కారణం ఇప్పటికీ పూర్తిగా తెలియదు. ఈ వ్యాధి ఎక్కువగా వృద్ధులు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్తమా రోగులు దుమ్ము, బురద, కాలుష్య ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ధూమపానం అస్సలు చేయకూడదు. చల్లని ప్రదేశాలు, చల్లని నీరు త్రాగకూడదు. ఆస్తమా ఉన్నవారు బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. దుమ్ము ధూళి శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడతాయి. ఇది ఆస్తమా వ్యాధిని ఎక్కువ పెంచుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే శ్వాస వ్యాయామం చేయాలి. ధ్యానం ప్రాణాయామం వంటివి చేయాలి.