Health Benefits : మగవారికి అద్భుతమైన శక్తినిచ్చే మొక్క..
Health Benefits : దువ్వెన బెండ లేదా అతిబాలా అని పిలిచే ఈ మొక్కను ఇండియన్ మాలో అని కూడా పిలుస్తారు. ఇది రోడ్ సైడ్ పెరిగే కలుపు మొక్కగానే కనిపిస్తుంది. ఇది దేశంలోని వేడి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడే ఎక్కువగా పెరుగుతుంది కూడా. సాంప్రదాయ ఔషధ విధానాల్లో, మూలాలు, ఆకులు, పువ్వులు, బెరడు, విత్తనాలు మరియు కాండం వంటి వివిధ భాగాలను ఉపయోగిస్తారు. ఈ మొక్కలోని యాంటి ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్, మూత్ర విసర్జన, హెపాటోప్రొటెక్టివ్, ఇమ్యూనోమోడ్యూలేటరీ, యాంటి హై పెర్లిపిడెమిక్, హైపోగ్లైసీమిక్, యాంటీ మైక్రోబయాల్, యాంటీ మలేరియా, గాయాలు నయం చేయడమే కాక విరేచనాలు తగ్గించే లక్షణాలు ఈ దువ్వెన బెండా లేదా ఇండియన్ మాలోలు ఎక్కువగా ఉంటాయి.
ఈ లక్షణాలు దిమ్మలు, పూతల, జ్వరం, మూత్రాశయం, సిఫిలిస్, కంటి శుక్లం, విరేచనాలు, కాళ్ల నొప్పులు, గర్భాశయ స్థాన భ్రంశం, పాము కాటు, పైల్స్, గనేరియా, దగ్గు, పొడి దగ్గు, రక్త స్రావం, సెప్టిసిమియా, కుష్టు, బ్రోన్కైటిస్ వంటి వ్యాధులను తగ్గించడానికి దువ్వెన బెండు చక్కగా సహాయ పడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, వాత దోష యొక్క అధిక తీవ్రత వల్లల ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి కారణం అవుతుంది. దీనిని సంధివత అని కూడా అంటారు. అతి బాలా వినియోగం శరీరంలో వాతాన్ని సమతుల్యం చేయడంతో పాటు వాపులను తగ్గిస్తుంది. వశ్యతను మెరుగు పరచడం ద్వారా ఉపశమనం కలిగిస్తుంది.ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి దువ్వెన బెండు వాడితే మంచి ఫలితం వస్తుంది.
అతి బాలాను తేనే లేదా గోరు వెచ్చని నీటితో తీసుకోవచ్చు. దువ్వెన బెండు పౌడర్ ను సగం టీ స్పూన్ తీసుకుని దానిని తేనె లేదా వేడి నీటిలో కలిపి దానిని తీసుకోవాలి. త్వరగా ఆస్టియో ఆర్థరైటిస్ నుండి కోలుకోవాలనుకునే వారు భోజనం తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగాలి. ఇలా చేస్తే ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య పరిష్కారం అవుతుంది.మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ దువ్వెన బెండు దివ్యౌషధం అనే చెప్పాలి. స్తంభన సరిగ్గా లేకపోయినా.. కార్యానికి ఉపక్రమించగానే.. త్వరగా చల్లబడిపోయినా అతి బాలాను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దువ్వెన బెండు పౌడర్ తీసుకోవడం వల్ల ఆ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నాణ్యత కూడా పెరుగుతుంది.