Apple : ఆపిల్ లో బ్యాక్టీరియా… తింటే ఏం జరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Apple : ఆపిల్ లో బ్యాక్టీరియా… తింటే ఏం జరుగుతుంది…!

Apple : ఆపిల్ పండు అంటే తెలియని వారు ఎవరు కూడా ఉండరు. ఈ పండు అనేది ఎర్రగా నిగనిగలాడుతూ మన కళ్ళకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఎన్నో రకాలుగా పనిచేస్తుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు శరీరంలో పేర్కొన్న కొవ్వును కూడా కరిగించడంలో ఎంతో సహాయపడతాయి. అయితే ప్రతిరోజు ఒక గుడ్డు తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో,అలాగే ఈ పండును ప్రతినిత్యం ఒకటి తీసుకోవడం […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Apple : ఆపిల్ లో బ్యాక్టీరియా... తింటే ఏం జరుగుతుంది...!

Apple : ఆపిల్ పండు అంటే తెలియని వారు ఎవరు కూడా ఉండరు. ఈ పండు అనేది ఎర్రగా నిగనిగలాడుతూ మన కళ్ళకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఎన్నో రకాలుగా పనిచేస్తుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు శరీరంలో పేర్కొన్న కొవ్వును కూడా కరిగించడంలో ఎంతో సహాయపడతాయి. అయితే ప్రతిరోజు ఒక గుడ్డు తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో,అలాగే ఈ పండును ప్రతినిత్యం ఒకటి తీసుకోవడం వలన కూడా అంతే లాభాలు కలుగుతాయి. అయితే ప్రతినిత్యం ఒక గుడ్డులాగా, ఒక యాపిల్ తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యం పక్క అని అంటున్నారు నిపుణులు. అయితే షుగర్ తో బాధపడే వారు ఆపిల్ తీసుకోకూడదు అంటారు. అలాగే ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలను నియంత్రించడంలో కూడా దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది.

ప్రస్తుతం తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం చూసినట్లయితే, ఒక్క ఆపిల్ లో కోట్లలో బ్యాక్టీరియా ఉంది అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ఆపిల్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది మన శరీరానికి మంచి చేస్తుందా లేక చెడును కలిగిస్తుందా అనే విషయం ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగించే విషయం. అయితే ఆస్ట్రేలియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చేసినటువంటి పరిశోధనలో 40 గ్రాములు బరువు ఉన్నటువంటి ఒక యాపిల్ లో సుమారుగా 10 కోట్ల వరకు ఈ బ్యాక్టీరియా అనేది ఉంది అని అధికారులు తెలిపారు.

Apple ఆపిల్ లో బ్యాక్టీరియా తింటే ఏం జరుగుతుంది

Apple : ఆపిల్ లో బ్యాక్టీరియా… తింటే ఏం జరుగుతుంది…!

సాధారణంగా మనం ఆపిల్ ను తొక్క, కాడ, గింజలు ఇలా అన్నింటిని తీసి పడేసి లోపలి భాగాన్ని తింటూ ఉంటాం. ఇలా చేయడం వలన దీనిలో ఉన్న చాలా బ్యాక్టీరియాను నష్టపోయిన వారు అవుతారు అని నిపుణులు అంటున్నారు. ఇదంతా కూడా మంచి బ్యాక్టీరియానే అని, మన శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నియంత్రించి ఆరోగ్యాన్ని రక్షించటంలో ఎంతో బాగా పని చేస్తుంది అని అంటున్నారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది