Cholesterol Symptoms : మీ కళ్ళపై ఇలా కనిపిస్తే మీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నట్లే…!
ప్రధానాంశాలు:
Cholesterol Symptoms : మీ కళ్ళపై ఇలా కనిపిస్తే మీ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నట్లే...!
Cholesterol Symptoms : మన శరీరంలో కొలెస్ట్రాల్ అనగానే చాలామంది భయపడతారు. కానీ కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండవది చెడు కొలెస్ట్రాల్.. మంచి కొలెస్ట్రాలనుnHDl అంటారు.. చెడు కొలెస్ట్రాల్ ని LDL అంటారు. ఈ ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మన శరీరానికి హాని చేస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది .అయితే మన శరీరంలో చెడు కొవ్వు అధికంగా కొన్ని లక్షణాలు ద్వారా చెడుకో ఉందని తెలుసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…
బాడ్ కొలెస్ట్రాల్ అధికమైనప్పుడు చర్మంపై పసుపు లేదా ఎరుపు రంగులో కురుపులు వస్తాయి. ముఖ్యంగా మోచేతులు, పాదాలు ముక్కలపై ఈ కురుపులు వస్తాయి. ఇవి ఒక్కొక్కసారి పెద్దవిగా కూడా ఏర్పడతాయి.. అలాగే పాదాలు వాపు, కాలు నొప్పి, తిమ్మిరిగా మారుతాయి. ఇవి కూడా చెడు కొలెస్ట్రాల్ కు సంకేతమే.. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ చేరడం మొదలైనప్పుడు అది గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది. అలాగే మీరు వేగంగా నడిచిన శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది వస్తుంది.
అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో అన్ని భాగాలకు తగినంత ఆక్సిజన్ ఉండదు. ఇది గుండెపై ఒత్తిడి తెచ్చి చాతి నొప్పికి కారణం అవుతూ ఉంటుంది..అలాగే కళ్ళ కింద లేదా కనురెప్పల మీద తెల్లగా పసుపు రంగులో కనిపించడం కొలెస్ట్రాల్ పెరిగింది అని సంకేతం. ఈ బాడ్ కొలెస్ట్రాల్ పెరిగింది అనడానికి ఇది సహజ లక్షణం. కనురెప్పలపై పసుపు మచ్చలు తొందరగా పోవు… ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్య నిపుణులని తప్పకుండా సంప్రదించండి.