Banana : అరటి పండుతో కూడా జుట్టు సమస్యలు చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Banana : అరటి పండుతో కూడా జుట్టు సమస్యలు చెక్ పెట్టొచ్చు... ఎలాగో తెలుసా...!!
Banana : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు సమస్య కూడా ఒకటి. అయితే ప్రతి ఒక్కరిని కూడా జుట్టు రాలిపోవడం లేక జుట్టు చిట్లి పోవడం లేక జుట్టు నెరిసిపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి వారికి ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి అని అంటున్నారు. అయితే వాటిలలో అరటి హెయిర్ మాస్క్ ఒకటి. అయితే ఈ అరటి పండులో విటమిన్ b6 మరియు విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా అవసరమైనవి. అలాగే ఇది జుట్టును సిల్కీగా మరియు మృదువుగా మారుస్తుంది. అంతేకాక బ్లాక్ బీన్స్ అనేవి జుట్టుకు మృదుత్వాన్ని మరియు తేజాన్ని, మెరుపును కూడా ఇస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్ లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో హెల్ప్ చేస్తాయి…
అయితే తెల్ల జుట్టు కోసం ఒక అరటిపండు మరియు ఒక చెంచా బ్లాక్ బీన్స్ పౌడర్, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తో హెయిర్ మాస్క్ ను తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక పెద్ద అరటి పండును తీసుకొని దానిలో సగం అరటి పండును తీసుకొని దానిని బాగా స్మాష్ చేయాలి. ఆ తర్వాత దానిలో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు ఒక చెంచా బ్లాక్ బీన్స్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అప్పుడు ఇది చక్కటి హెయిర్ ప్యాక్ లా తయారవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు హెయిర్ డై వేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ను నుదిటి నుండి చివర్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఒక గంట పాటు అలా వదిలేయాలి. అది బాగా ఆరిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ను ప్రతిరోజు వాడడం వలన మీ తెల్ల జుట్టు అనేది శాశ్వతంగా నల్లగా మారిపోతుంది…
ఒక అరటి పండు మిశ్రమంలో ఒక టీ స్పూన్ అలోవెరా జెల్ మరియు ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మంచి క్రీమ్ గా తయారవుతుంది. ఈ మిశ్రమం మొత్తాన్ని జుట్టుకి బాగా అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక నెలలో రెండు సార్లు చేయటం వలన జుట్టు సమస్యలు అనేవి నయం అవుతాయి. ఈ అరటి పండులో విటమిన్లు మరియు పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్ లాంటి కనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టుకు ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే పాడేనటువంటి జుట్టును కూడా రిపేర్ చేస్తుంది. దీనిని ప్యాక్ లా చేసుకుని ఉపయోగించటం వలన కండిషనర్ లా కూడా పని చేస్తుంది