Banana Peel : అరటి తొక్కలతో కూడా దోమలను తరిమి కొట్టొచ్చనే సంగతి మీకు తెలుసా…!!
ప్రధానాంశాలు:
Banana Peel : అరటి తొక్కలతో కూడా దోమలను తరిమి కొట్టొచ్చనే సంగతి మీకు తెలుసా...!!
Banana Peel : సాయంత్రం అయ్యింది అంటే చాలు దోమలు బేడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు గుయ్యిమంటూ శబ్దం చేస్తూ రక్తాన్ని పిలుస్తూ ఉంటాయి. ఈ దోమలు కుట్టడం వలన డెంగ్యూ మరియు మలేరియా లాంటి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ దోమలను తరిమి కొట్టడానికి రకరకాల మార్గాలను కూడా ఎంచుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే రసాయనాలు ఉన్న వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే వీటి వలన ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది అని అంటున్నారు నిపుణులు. అందుకే ఈ దోమలను సహజ పద్ధతులలోనే తరిమికొట్టాలి. మనం అరటి పండ్లు తిన్న వెంటనే తొక్కలను పారేస్తూ ఉంటాం. అయితే ఈ తొక్కలతోనే దోమలను తరిమి కొట్టొచ్చు అనే సంగతి మీకు తెలుసా. అయితే ఈ దోమలను తరిమి కొట్టడానికి అరటి తొక్కలను ఎలా వాడతారు అనేగా మీ సందేహం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం…
దీని కోసం ప్రత్యేకంగా ఎం చేయాల్సిన అవసరం లేదు. సాయంత్రం కాగానే దోమలు ఎక్కువగా ఉండే గదిలో నాలుగు చివరలలో నాలుగు అరటి తొక్కలను పెట్టాలి. అయితే ఈ అరటి తొక్కల నుండి వెలువడే ఒక రకమైన వాసన దోమలను తరిమికొడుతుంది. ఈ వాసనతో దోమలు అనేవి దూరంగా పారిపోతాయి. అలాగే అరటి తొక్క పేస్ట్ కూడా బాగా సహాయపడుతుంది. దీనికోసం అరటి తొక్కలను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని దోమలు ఎక్కువగా ఉండే మూలల్లో అప్లై చేసుకోవాలి. మీరు ఇలా చేయటం వలన కూడా దోమలు అనేవి త్వరగా పోతాయి.
ఇకపోతే అరటి తొక్కలను బాగా ఎండబెట్టి వాటిని కాల్చడం వలన కూడా దోమలు పోతాయి. ఈ అరటి తొక్కలను ఎండలో బాగా ఆరబెట్టాలి. దాని తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసి కాల్చాలి. దీంతో ఇల్లంతా పొగ పట్టించాలి. దీని వలన సాయంత్రం పూట ఇంట్లోకి వచ్చే దోమలన్నీ కూడా పారిపోతాయి. కానీ ఈ పొగను నేరుగా పీల్చడం అంత మంచిది కాదు. కావున కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది