Banana Peel : తొక్కే కదా అని ఈజీగా పడేస్తున్నారా.. అరటి తొక్కతో ఆరు అద్భుత లాభాలెంటో మీకు తెలుసా..!
Banana Peel : అరటిపండు.. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ దొరికే పండు. తక్కువ ధరతో శరీరానికి ఎక్కువ మేలు చేసే తీపి పండు. అరటిలో ఎన్నో పోషక విలువలుంటాయన్న విషయం మనకు తెలిసిందే. రోజూ ఉదయం పరిగడపున ఒక అరటి పండు తింటే ఆరోగ్యానికి చాలా మేలు అని, రోజూ ఆహారంలో ఒక అరటి పండు చేర్చుకొమ్మని వైద్య నిపుణులు సూచిస్తునే ఉన్నారు. అయితే ఇదంతా మనకు తెలిసిన విషయమే.. తెలియంది ఏమిటంటే, అరటి పండు తొక్క కూడా మనకి హెల్ప్ చేస్తుందని ఇప్పుడే అదే వైద్య నిపుణులు అంటున్నారు. ఏంటీ షాక్ అయ్యారా.. తొక్కే కదా అని ఈజీగా తీసి పారేసే ముందు.. ఓసారి ఈ వార్త చదవండి.. ఇక మీరు పడేయమన్న పడేయరు.
1. ముఖంపై ముడతలు : అరటి పండు తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి తొక్క లోపలి భాగంతో ముఖాన్ని రుద్ది.. ఓ అరగంట ఆగి చల్లటి నీళ్లతో కడుగుతూ.. ఓ వారం పాటు ఇలాగే చేశారంటే మీ ముఖం మీద ఉన్న ముడతలను ఈజీగా తగ్గించుకోవచ్చు.
2. నిగ నిగాలడే పళ్ళు: మనలో కొంతమందికి ఎదిగే క్రమంలో పళ్లు కొద్దిగా లేత పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఎంత తోమినా తెల్లగా కాకపోగా పళ్లను పెదవుల కిందే దాచుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అరటి తొక్క లోపలి భాగంతో పళ్ళని రుద్దడం వల్ల మీ పళ్ళు నిగ నిగలాడుతూ తెల్లగా మెరిసిపోతాయి.
3. దురదల నుంచి ఉపశమనం :ఏదైనా దోమ వంటి పురుగుల కాటుకు గురై.. చర్మంపై దురదలు, మంటలు కనుక వస్తే వాటిని తగ్గించడానికి అరటి పండు తొక్క ఉపయోగపడుతుంది. చర్మంపై ఎక్కడైతే సమస్యగా ఉందో అక్కడ అరటి పండు తొక్కను రాసి 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దురద, మంట తగ్గిపోతుంది.
4. జిడ్డు ముఖం : మన దినచర్య లో భాగంగా బయట ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది. ఎండలో తిరగడం వల్ల చర్మం అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది. అద్దంలో మన ముఖం మనం చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో.. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అరగంట సేపు ఆగాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.
5. దెబ్బలకు మందు : కాలిన గాయాలు, దెబ్బలకు అరటి పండు తొక్క ఓ మంచి ఔషధంగా పనిచేస్తుంది. సమస్య ఉన్న శరీర భాగంపై అరటి పండు తొక్కను ఉంచి కట్టు కట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒకటి, రెండు రోజుల్లోనే దెబ్బలు మానిపోతాయి.
6. నొప్పికి ఉపశమనం : మన శరీరం లో ఏదైనా భాగంలో చిన్న పాటి నొప్పిగా ఉంటే అక్కడ అరటి పండు తొక్కను కొద్ది సేపు మసాజ్ చేసినట్టు రాయాలి. ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే నొప్పి మాయమవుతుంది.