Tea : చర్మ సమస్యలతో బాధపడుతున్నారా… ఈ టీ తీసుకోండి… అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : చర్మ సమస్యలతో బాధపడుతున్నారా… ఈ టీ తీసుకోండి… అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2024,1:00 pm

Tea : ప్రస్తుత కాలంలో చాలా మంది చర్మ సమస్యలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిజీ జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం వలన ముఖంపై ఎన్నో చర్మ సమస్యలను కలిగిస్తూ ఉన్నది. దీంతో అందంగా ఉన్న ముఖం డల్ గా మారటం మొదలవుతుంది. అలాంటి పరిస్థితులలో మన వంట ఇంట్లో ఉన్నటువంటి మసాలాలతో తయారు చేసినటువంటి సహజ టీని తాగడం వలన ముఖ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాంటి వాటిలో సోంపు, జిలకర్ర,ధనియాల తో తయారు చేసిన అద్భుతమైన టీ. సోంపు,జిలకర్ర,ధనియాలు వీటి అన్నింటినీ కూడా మనం ఇంట్లో ఎక్కువగా వాడుతూనే ఉంటాం. ఆహారం రుచి మరియు పోషకాలను మెరుగుపరిచేందుకు వీటిని వాడుతూ ఉంటాం. ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందేందుకు మీరు జీలకర్ర, సోంపు, ధనియాల కషాయాన్ని కూడా తయారు చేసుకుని తాగొచ్చు. దీంతో ఆరోగ్యం కూడా ఎన్నో ప్రయోజనాలను పొందుతుంది. అంతేకాక ఈ మూడింటిని కలిపి కూడా తయారు చేసుకొని తాగొచ్చు. ఈ వేసవిలో శరీరాన్ని డిటాక్సి ఫై చేయటమే కాక మరెన్నో విషయాలలో ఈ అద్భుతమైన టీ ఎంతో బాగా పని చేస్తుంది..

ఈటీవీ తీసుకోవటం వలన రోజంతా ఎంతో తాజాదనంతో ఉండేలా సహజమైన మెరుపును కూడా ఇస్తుంది. జిలకర్ర,సోంపు, ధనియాలతో తయారు చేసిన టీ చర్మానికి యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తుంది. ఈ మూడింటిలో ఎక్కువగా ఖనిజాలు,విటమిన్లు ఉండటం వలన చర్మానికి సంబంధించిన సమస్యలపై పూర్తిగా పనిచేసె క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి వలన ముఖం పై ఎలాంటి ఇన్ఫెక్షన్లు అనేవి రాకుండా చూస్తుంది. వేసవిలో జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారు ఈ టీ ని తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఎందుకు అంటే. వేడి,చెమట కారణం వలన చర్మంపై అధిక నూనె అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంతో చర్మంపై మురికి అనేది పేరుకు పోతుంది. దీంతో ఇది ఎన్నో రకాల చర్మ సమస్యలను కూడా కలిగిస్తుంది. అలాగే వేసవిలో మొటిమల సమస్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.

Tea చర్మ సమస్యలతో బాధపడుతున్నారా ఈ టీ తీసుకోండి అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టండి

Tea : చర్మ సమస్యలతో బాధపడుతున్నారా… ఈ టీ తీసుకోండి… అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టండి…!

ఈ పరిష్కారం అనేది చర్మం పై శీతలికరణ ప్రభావాన్ని అందించడంలో సమృద్ధిగా ఉంటుంది. మొటిమలు మరియు మచ్చల సమస్యలు తగ్గించడంలో ఎంతో బాగా పని చేస్తుంది.ఈ అద్భుతమైన టీలో కాల్షియం, జింక్,సెలోనీయం అధికంగా ఉన్నాయి. దీంతో ఇది హార్మోలను సమతుల్యం చేస్తుంది.శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను కూడా ఎంతగానో నిర్వహిస్తుంది. ఇది ఎంతో ఆరోగ్యకరమైన చర్మంతో పాటుగా మెరుపును కూడా అందిస్తుంది.. ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం : ఈ టీ ని తయారు చేసేందుకు అర టీ స్పూన్ జిలకర,ధనియాలు, సోంపు తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం లేవగానే ఆ నీటిని బాగా మరిగించి ఒక గ్లాసులోకి వడగట్టుకోవాలి. దానిలో కొంచెం తేనె,నిమ్మరసం, ఉప్పు కలుపుకుంటే చాలు అద్భుతమైన టీ రెడీ…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది