Beauty Tips : ఒకే ఒక్క నిమిషంలో నోటి దుర్వాసనను దూరం చేసే అద్భుతమైన చిట్కా..!
Beauty Tips : కొంత మంది నలుగురిలో మాట్లాడాలన్నా, నవ్వాలన్నా తెగ ఇబ్బంది పడిపోతుంటారు. అందుకు ప్రధాన కారణం పళ్లు పచ్చగా ఉండటం.. అలాగే దుర్వాసన రావడం. వీటి వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంకెలాంటి సమస్యలు ఉన్నా బయట తిరిగేందుకు ఇబ్బంది పడని వారంతా… నోటి దుర్వాస ఉంటే మాత్రం చాలా అవమానంగా ఫీలవుతూ ఉంటారు. ఇందుకోసం డెంటిస్ట్ ల వద్దకు వెళ్లి పళ్లు కడిగించుకోవడం.. రకరకాల స్ప్రేలను నోట్లో కొట్టుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే వీటి వల్ల ఉండే లాభాల కన్నా వంటింటి చిట్కాల వల్లే ఫలితాలు బాగుంటాయి.నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు గోరు వెచ్చటి నీళ్లలో… అరచెంచా ఉప్పు వేసి బాగా కలిపి పుక్కిలించినట్లయితే నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెందదు.
అంతే కాకుండా నోటి దుర్వాసన తగ్గుతుంది. ఉప్పు నీటిలో నోటి దుర్వాసనను తగ్గించే ఎన్నో కారకాలు ఉంటాయి. ముఖ్యంగా బయటకి వెళ్లాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తే నోరు రీఫ్రెష్ అవుతుంది. అలాగే లవంగాలు కూడా నోటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. లవంగాలు నోటి దుర్వాసనను దంతక్షయం, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు రోజూ రెండు లవంగాలను నీటిలో నానబెట్టుకొని… ఉదయాన్నే నమిలి తినేసి ఆ నీటిని కూడా తాగేయాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. లవంగాలు, ఉప్పు మీ దగ్గర ఉన్నట్లయితే నోటి దుర్వాసన మీ నుంచి దూరంగా పారిపోతుంది.
పంటి నొప్పి కారణంగా నమలడం వీలు కాకపోతే.. అందుకు బదులుగా పేస్టు తయారు చేసుకోవాలి. నొప్పి ఉన్న పంటికి నేరుగా అప్లై చేయవచ్చు. మీకు నోటి దుర్వాసన నిలకడగా ఉండే వరకు కొన్ని లవంగాలను చూర్ణం చేసి… కొద్దిగా ఉప్పు వేయండి. ప్రభావిత ప్రాంతంలో కాసేపుడ పేస్ట్ ఉంచండిఅంతే కాదండోయ్ నొప్పిని కల్గించే బ్యాక్టీరియా ప్రభావాన్ని వెల్లుల్లి తగ్గిస్తుంది. నోటి దుర్వాసన సమస్యను తగ్గించడంలో బాగా సాయపడతాయి. చిగురు నొప్పిగా ఉన్న లేదంటే ఏవైనా సమస్యలు ఉన్న, కురుపులు అయినప్పుడు కూడా ఉప్పుతో పళ్లను తోమడం వల్ల తగ్గుతాయి. లవంగ నూనను దంతాలకు ఉపయోగించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.