Beauty Tips : రాత్రి సమయంలో దీనిని రాసుకొని పడుకుంటే… మీ ముఖం తెల్లగా మారడం చూసి మీరు అవాక్ అవుతారు…
Beauty Tips : అందరూ సహజంగా అందంగా ఉండాలి. తెల్లగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి మొహం మీద మచ్చలు, మొటిమలు వస్తూ ఉంటాయి. ఇలా మొహంపై ఎన్నో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని నివారించుకోవడానికి పార్లల్ కి వెళ్తూ ఉంటారు. లేదా ఎన్నో ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. దీనికోసం ఎన్నో డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే వాటి నుంచి ఎటువంటి ఉపశమనం కలగదు.. అయితే అటువంటి వారికి ఇంట్లోనే ఉన్న ఇంగ్రిడియంట్స్ తో ఫేస్ పై ఉన్న మొటిమలు ,మచ్చలు ,నల్లటి వలయాలు ఇలా అన్ని సమస్యలను నివారించుకోవచ్చు.. ఇక దీనికోసం ఆలుగడ్డను ముందుగా తీసుకోవాలి. ఈ ఆలుగడ్డ నేచురల్ బ్లీచింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ ఆలుగడ్డ ఫేస్ పై మొటిమలు మొటిమలు వల్ల వచ్చే నల్లటి మచ్చలు తొలగిస్తుంది.
అదేవిధంగా సన్ టాన్ తొలగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆలుగడ్డ తొక్క తీసుకొని దీనిని మెత్తగా తురుముకోవాలి. తరువాత దీని నుండి వచ్చిన జ్యూస్ ను వడకట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ జ్యూస్ వద్దు అనుకున్న వాళ్లు క్యారెట్ రసాన్ని కూడా లేదా బీట్రూట్ రసాన్ని కూడా వినియోగించుకోవచ్చు. తర్వాత ఇక దీనిలోకి ఒక చెంచా బాదం నూనెను కలుపుకోవాలి. ఈ బాదం నూనె ఫేస్ పై మచ్చలను తగ్గించడానికి అలాగే ఫేస్ నీ స్మూత్ గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత దీంట్లోకి రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ని కలుపుకోవాలి. ఈ క్యాప్సిల్స్ మొహం పై ఉండే నల్లటి మచ్చలు ,పిగ్మెంటేషన్, ముడతలు లాంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. తరువాత ఒక చెంచా కలమంద జెల్ ను కూడా కలుపుకోవాలి.
ఈ కలమంద ఫేస్ ని స్మూత్ గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వీటి అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. తర్వాత రాత్రి సమయంలో ఫేస్ ని శుభ్రంగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకుని పడుకోవాలి. ఇది ఫేస్ సిరం లాగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే నిత్యము ఫేస్ పై రాసుకోవడం వలన ముఖంపై వచ్చిన నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గిపోయి ముఖం మెరిసిపోతుంది. ఇటువంటి మిశ్రమాన్ని మార్కెట్లో కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే న్యాచురల్ గా తయారు చేసుకుని వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు ఉపయోగించుకోవచ్చు..