Cucumber Seeds : దోసకాయ గింజల లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!
ప్రధానాంశాలు:
Cucumber Seeds : దోసకాయ గింజల లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!
Cucumber Seeds : కీరా దోసకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీనిని ఔషధ గుణాల నిధి లాటి కూరగాయ అని చెప్పొచ్చు. ఈ కీరా దోసకాయను సల్లాడ్ లో మాత్రమే కాకుండా ప్రతి వంటల్లో కూడా ఉపయోగిస్తారు. అయితే దోసకాయ మాత్రమే కాకుండా దాని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని పోషకాహార నిపునులు అంటున్నారు. ఇవి మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవటం వలన హై బీపీ నుండి డయాబెటిస్ వరకు అన్నిటికీ దివ్య ఔషధం లా పనిచేస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఈ కీరా దోసకాయ గింజలను డైరెక్ట్ గా నమిలి తీసుకోవచ్చు లేకపోతే పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ కీరా దోసకాయ గింజలను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
1. జీర్ణక్రియ కు ఉపయోగపడుతుంది : ఈ దోసకాయ గింజలలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తాయి. దీనిలో పీచు అనేది పుష్కలంగా ఉండడం వలన మలబద్ధక సమస్యలు కూడా దూరం చేస్తుంది. అలాగే పొట్టను క్లిన్ గా ఉంచడంలో కూడా మేలు చేస్తుంది. అయితే ప్రతినిత్యం దోసకాయ గింజలను ఒక స్పూన్ తీసుకుంటే చాలా మంచిది అని నిపుణులు అంటున్నారు…
2. బరువు తగ్గటంలో ఉపయోగపడుతుంది : ఈ దోసకాయ గింజలు బరువును తగ్గించడంలో కూడా మేలు చేస్తాయి. ఇవి చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ని ఇస్తుంది. దీంతో ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. దీంతో బరువు కూడా ఈజీగా తగ్గవచ్చు. అందువల్ల దోసకాయ మరియు దాని గింజలను ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకుంటే మంచిది అని నిపునులు అంటున్నారు…
Cucumber Seeds 3. మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి
ఈ కీరా దోసకాయ గింజలలో మెగ్నీషియం మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే అధిక రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుంది…
4. ఎముకలను బలోపేతం చేస్తుంది :ఈ దోసకాయ గింజలలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను ఎంతో బలంగా తయారు చేస్తాయి. వీటిని ప్రతినిత్యం తీసుకోవడం వలన ఆస్టియోపోరోసిస్ లాంటి ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేస్తుంది…
5. చర్మ సంరక్షణ : ఈ దోసకాయ గింజలను చర్మ సంరక్షణకు కూడా వాడతారు. దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాని యవ్వనంగా మరియు ఎంతో తాజాగా ఉంచుతాయి. ఈ గింజలను పేస్ట్ లా చేసుకుని ఆ పేస్ట్ ను ముఖంపై అప్లై చేసుకోవటం వలన మచ్చలు మరియు ముడతలు లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది…
6. నిర్విషీకరణ : ఈ గింజలు అనేవి డిటాక్సీ ఫైయింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి శరీరం నుండి విషన్ని బయటకు పంపించడంలో మేలు చేస్తాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచటం లో కూడా ఎంతో మేలు చేస్తుంది.
7. మధుమెహన్ని నియంత్రిస్తుంది : ఈ గింజలలో ఉండే ఫైబర్ మరియు ఇతర పోషకాలు మధుమేహాన్ని తగ్గిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అలాగే శరీరాన్ని కూడా ఎంతో శక్తివంతంగా ఉంచుతుంది…
8. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది : ఈ కీరా దోసకాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి. దీనివలన శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి వస్తుంది. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది…