Cucumber Seeds : దోస గింజల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలిస్తే అస్సలు వదలరు…
ప్రధానాంశాలు:
Cucumber Seeds : దోస గింజల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలిస్తే అస్సలు వదలరు...
Cucumber Seeds : మనమందరం దోసకాయలను తినడాన్ని ఇష్టపడతాం. ఇది లేకపోతే సలాడ్ ప్లేట్లు అసంపూర్తే. అయితే దోసకాయ గింజలను కూడా తినవచ్చని మీకు తెలుసా? ఫైబర్ అధికంగా ఉండే ఈ విత్తనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందామా? దోసకాయ మరియు దాని విత్తనాలను చాలా స్పా చికిత్సల్లో ఉపయోగిస్తారు. దోసకాయ ముక్కలను చల్లదనం కోసం కళ్లపై ఉంచుతారు. దోసకాయ గింజలలో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తి, చర్మం, కండ్లు, మరియు క్యాన్సర్ నివారణలో సహాయ పడుతుంది.
హైడ్రేట్ గా ఉండడం..
మీరు ఒక రోజులో ఎంత నీరు తీసుకుంటారు? నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది. మీరు తీసుకునే మొత్తం నీటిలో 40 శాతం ఆహారం నుండి పొందుతారు. పండ్లు, కూరగాయల్లో నీరు కీలకమైన వనరుగా ఉంటుంది. దోసకాయలు దాదాపు 96 శాతం నీటిని కలిగి ఉంటాయి. హైడ్రేషన్‌ను ప్రోత్సహించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. మీ రోజువారీ ద్రవ అవసరాలను తీర్చడంలో మీకు సహాయపడుతుంది.
అయితే పలువురికి దోసకాయ గింజలు తినడం ఉండదు. అటువంటి వారు బేక్డ్ దోసకాయ చిప్స్, దోసకాయ పచ్చడి, దోసకాయ సలాడ్ గా తీసుకోవచ్చు. దోసకాయ విత్తనాలను కొనుగోలు చేసిన 60 రోజులలోపు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడం కోసం..
చాలా స్పా థెరపీలలో, ప్రజలు తమ కళ్లపై దోసకాయ ముక్కలను ఉంచడం ద్వారా విశ్రాంతి తీసుకుంటారు. దోసకాయ చల్లదనం వాపు, చికాకు తగ్గిస్తుంది. ఉదయం ఉబ్బరం తగ్గుతుంది. వడదెబ్బకు చికిత్సగా ఉపయోగపడుతుంది.
నోటి దుర్వాసనను తగ్గిస్తుంది..
మీరు నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా? అయితే అటువంటి వారికి కీరదోస చక్కని ఉపశమనం ఇస్తుంది. మీ నోటి పై భాగంలో దోసకాయ ముక్కను ఉంచండి. అది బ్యాక్టీరియాను అధిగమించడంలో మీకు సహాయ పడుతుంది.
పోషక విలువలు..
దోసకాయలో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, పాంతోతేనిక్ యాసిడ్ మరియు కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుపచ్చ కూరగాయ మన బంధన కణజాలాన్ని బలోపేతం చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దోసకాయ గింజల్లో కాల్షియం,ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.