Lungs Infection : జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తులు క్లీన్ అవ్వడానికి నాచురల్ పొడి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lungs Infection : జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తులు క్లీన్ అవ్వడానికి నాచురల్ పొడి…!

 Authored By jyothi | The Telugu News | Updated on :31 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Lungs Infection : జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తులు క్లీన్ అవ్వడానికి నాచురల్ పొడి...!

Lungs Infection : జీవనశైలి మార్పుల వల్ల అనేక రకాల రోగాలు వస్తున్నాయి. బయటకు వెళితే కలుషితమైన గాలి వల్ల కూడా ప్రాణాంతకమైన రోగాలను ఎదుర్కొంటున్నారు. చాలామంది ఈ కలుషితమైన గాలి వల్ల చాలామంది న్యూమోనియాకు గురవుతున్నారు. అయితే దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఇది ఎక్కువగా చిన్నపిల్లలకు వస్తూ ఉంటుంది. అయినా సరే అన్ని వయస్సులవారు కూడా ఈ రోజుల్లో దీన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి మనం నిమోనియా పై అలాగే దీనికి సంబంధించి ఊపిరితిత్తులను క్లీన్ గా ఎలా ఉంచుకోవాలి? ఎందుకంటే దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యేవి ఊపిరితిత్తులే కాబట్టి వీటిని ఎలా ఆరోగ్యంగా క్లీన్ గా ఉంచుకోవాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. మనం పీల్చుకునే గాలిలో సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల్లో అత్యంత కీలకమైన గాలిగది అనే భాగంలో ఆక్సిజన్ కార్బన్డయాక్సైడ్ మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఏదైనా కారణాలవల్ల ఆల్ లో వాయు మార్పిడి జరగకపోతే శ్వాసక్రియ సక్రమంగా జరగకుండా ఉంటే దానిని నిమోనియా అంటారు. దీనిని బ్యాక్టీరియా సేఫ్టీస్నియాగా పిలుస్తారు. ఇది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి అలాగే ఊపిరితిత్తులు సమస్య ఉన్నవాళ్లకి దీర్ఘకాలం పాటు మందులు వాడే వాళ్ళకి అలాగే స్మోకింగ్ చేసే వాళ్లకు కూడా ఈ నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరి ఎటువంటి సమస్యలు ఇంటి చిట్కాలతో అంటే ఆయుర్వేదిక్ పద్ధతుల్లో నేచురల్ ఇంగ్రిడియంట్స్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. శరీరం తనకి తాను బాగు చేసుకోవడానికి ఒక్కొక్కసారి జ్వరం రూపంలో సంకేతం ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే యాంటీబయాటిక్ అని రకరకాల మందులు వేసి జ్వరం తగ్గించేసుకొని యధావిధిగా ఆహారాన్ని తినేస్తూ ఉంటారు. అలాకాకుండా అవయవాలు చక్కగా శుభ్రం అవ్వాలి అంటే ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కొంచెం తేనె అలాగే కొద్దిగా మిరియాల పొడి కొంచెం యాలకుల పొడి కలుపుకుని చక్కగా తాగండి. ఇలా తాగిన రెండు గంటల తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్లు తాగండి. మళ్లీ రెండు గంటలు గడిచాక తేనె నీళ్లు తాగండి. ఇలా రెండు గంటలకు ఒకసారి గోరువెచ్చని నీళ్లలో ఇలా తేనె నిమ్మరసం, మిరియాలు యాలకుల పొడి కలుపుకుని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. లోపల అవయవాలు చక్కగా క్లీన్ అవుతాయి. యాంటీ బాడీ ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుంది. దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల శరీరంలోని వ్యర్ధాలు అన్ని ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. అలాగే పరగడుపునే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల అల్లం రసం లేదా అల్లంను నీటిలో బాగా మరిగించి ఒక గ్లాసు నీటిని తాగిన ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఉదయాన్నే కొన్ని పుదీనా ఆకులను తిన్న లేకపోతే పుదీనా జ్యూస్ చేసుకుని తాగిన ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది.

శుభ్రం అవుతాయి. గోరువెచ్చని నీటిలో ఐదు నుంచి పది చుక్కల యూక్లిప్టస్ ఆయిల్ వేసి పిలిస్తే ఊపిరితిత్తుల్లో ఉండే మలిణాలు అన్ని పోతాయి. శుభ్రపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక అలాగే గ్రీన్ టీ తాగే అలవాటు చాలా మంది ఉంటుంది. గ్రీన్ టీ తాగిన లేదా పుదీనా ఆకులతో టీ చేసుకుని తాగిన సరే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి అని పేర్కొంటున్నారు. ఇవి శరీరంతో పాటు లంగ్స్ లోని మలినాలను బయటకు పంపుతాయి.అలాగే వ్యాయామం ప్రాణాయామం చేయడం వల్ల మీ లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. దీనివల్ల శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోయి శుభ్ర పడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు..ప్రతిరోజు ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే ఆరోగ్యవంతంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి శ్వాస కోసం ఇన్ఫెక్షన్లను తగ్గించడంతోపాటు లంగ్స్ ను శక్తివంతంగా మారుస్తాయి. ఇక అలాగే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకోవాల్సిన ఆహార నియమాలు కూడా ఇప్పుడు కొన్ని చూద్దాం బీట్రూట్ ఇందులో తినడం వల్ల కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రోజుకి ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకుంటాం కదా వాటిలో బచ్చలకూర ముఖ్యమైంది. ఈ కూరలో అధిక స్థాయిలో ఆంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు ఉంటాయి. అదే పండ్ల విషయానికి వస్తే ఆరంజ్ దీని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తుల ఇంజక్షన్ తగ్గిస్తుంది..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది