Black Pepper : చిటికెడు మిరియాల పొడి నెయ్యిలో కలిపి తింటే… ఆ వ్యాధులన్నీ పరార్…!
Black Pepper : ప్రస్తుతం చాలామంది ఎన్నో వ్యాధులతో సతమతమవుతున్నారు. వాటి కారణం.. మన జీవనశైలి విధానంలో ఆహారపు అలవాట్లు వలన అయ్యి ఉండవచ్చు.. దానికి వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది వస్తూనే ఉంది.. దీనికోసం ప్రతి రోజు రకరకాల మందులు వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ దీర్ఘకాలం వ్యాధుల నుండి బయటపడడం కోసం వంట గదిలో ఉండే ఈ పదార్థాలన్ని కలిపి తీసుకుంటే ఇకపై మందులు వాడాల్సిన అవసరం మే ఉండదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వంట గదిలో ఉండే ఆ రెండు పదార్థా లు వాటి వలన ఎలాంటి వ్యాధులు తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నల్ల మిరియాలు నెయ్యి ఒక చెంచా నెయ్యి తీసుకొని దానిలో కొన్ని నల్ల మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని తీసుకోవాలి. ఇలా ఒక చెంచా తీసుకుంటే ఎన్నో లాభాలు పొందవచ్చు.. ఏడాది పొడవున దగ్గు ,జలుబు లాంటి సమస్యలు ఉంటే నెయ్యి నల్ల మిరియాల పొడి మిశ్రమం తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇది వాయు మార్గాన్ని శుభ్రంగా చేస్తుంది. దాని ఫలితంగా ముక్కు బ్లాక్ అవ్వకుండా సాఫీగా ఉంటుంది. కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు ఉన్నవారు రోజు నెయ్యి మిరియాలపొడి కలిపి ఒక స్పూన్ తీసుకోవాలి.
కీళ్ల వాపులు, నొప్పి తగ్గించడానికి నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. మిరియాలు నెయ్యి తింటే గుండె కాలేయానికి మేలు జరుగుతుంది. మీరు కాలేయ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ రెమిడిని పాటించి చూడండి..నల్ల మిరియాలు నెయ్యి శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది చాలా వ్యాధుల్ని నయం చేయగల చక్కని మెడిసిన్ లా పనిచేస్తుంది. నల్ల మిరియాలు నెయ్యి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. నెయ్యిలో ఉండే ఏ, ఇ ,కె విటమిన్లు శరీరం శక్తిని అమాంతం పెంచుతాయి.