Black Pepper : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా… వీటితో చెక్ పెట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Black Pepper : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా… వీటితో చెక్ పెట్టండి…!

Black Pepper : మన దేశంలో ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉండే సుగంధ ద్రవ్యాలలో ఈ నల్ల మిరియాలు కూడా ఒకటి. అయితే ఈ నల్ల మిరియాలు ఘాటుగా ఉండటంతో వీటిని తినటానికి ఎవరు ఇష్టపడరు. అయితే ఈ నల్ల మిరియాలను వాడటం వలన జీర్ణక్రియ ను ఎంతో వేగవంతం చేసుకోవచ్చు. అలాగే శరీరంలోని టెస్ట్ బడ్స్ ను కూడా యాక్టివేట్ చేస్తాయి. దీని వలన జీర్ణ ప్రక్రియ అనేది ఎంతో వేగంగా జరుగుతుంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Black Pepper : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా... వీటితో చెక్ పెట్టండి...!

Black Pepper : మన దేశంలో ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉండే సుగంధ ద్రవ్యాలలో ఈ నల్ల మిరియాలు కూడా ఒకటి. అయితే ఈ నల్ల మిరియాలు ఘాటుగా ఉండటంతో వీటిని తినటానికి ఎవరు ఇష్టపడరు. అయితే ఈ నల్ల మిరియాలను వాడటం వలన జీర్ణక్రియ ను ఎంతో వేగవంతం చేసుకోవచ్చు. అలాగే శరీరంలోని టెస్ట్ బడ్స్ ను కూడా యాక్టివేట్ చేస్తాయి. దీని వలన జీర్ణ ప్రక్రియ అనేది ఎంతో వేగంగా జరుగుతుంది. అయితే ఇది పేగులను క్లీన్ చేసి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా నియంత్రిస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియన్ గుణాలు ఉన్నాయి. ఈ లక్షణాలతో శరీరంలోని జీర్ణ వ్యవస్థ మరియు రోగనిరోధక శక్తి ఎన్నో రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో మీరు టీ లేక డికాషన్ లాంటి పానీయాలను కూడా చేసుకొని తీసుకోవచ్చు. అయితే దీనిలో ఉన్నటువంటి పైపెరిన్ మరియు యాంటీ ఒబెసిటి గుణాలు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే నువ్వుల నూనె ను కూడా వేడి చేసుకోండి. దీనిలో నల్ల మిరియాలు కూడా వేసి చల్లారనివ్వండి. ఈ నూనెతో నొప్పులు ఉన్న ప్రాంతంలో మర్ధన చేసినట్లయితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

అలాగే నెయ్యి మరియు నల్ల మిరియాల ను ప్రతినిత్యం తీసుకుంటే డయాబెటిస్ మరియు కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.. పసుపు మరియు మిరియాల పొడిని పాలలో కలుపుకొని తీసుకున్నట్లయితే జలుబు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఎ,కెరోటి నాయిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇది క్యాన్సర్ ను మాత్రమే కాక ఎన్నో రకాల వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది. మీరు గనక ఈ నల్ల మిరియాలను మీ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే శరీరం అనేది సహజంగా ఫిట్ గా ఉంటుంది. అయితే ఈ నల్ల మిరియాల పొడి మరియు నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకొన్నట్లయితే గ్యాస్ మరియు అసిడిటీ సమస్యల నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది అని ఆయుర్వేద శాస్త్రం తెలిపింది.

Black Pepper వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా వీటితో చెక్ పెట్టండి

Black Pepper : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా… వీటితో చెక్ పెట్టండి…!

అయితే ఈ నల్ల మిరియాల పొడిని ఒక చిటికెడు అన్ని ఆహారాలలో కలిపి తీసుకుంటే మంచిది అని అంటున్నారు. దీనివలన ఎన్నో రకాల పొట్ట సమస్యలకు చెక్ పెట్టొచ్చు. నల్ల మిరియాల పొడిని రోజు వారి ఆహారంలో కొద్దిగా కలిపి తీసుకున్నట్లయితే మలబద్దకం లాంటి సమస్యలు రావు. ఏదైనా సరే కొద్దిగా తినడమే మంచిది. లేకుంటే సమస్యలు తప్పవు. మిరియాలు తింటే మంచిదే కదా అని మోతాదుకు మించి తీసుకున్నట్లయితే జీర్ణ సమస్యలతో పాటు నోరు, గొంతులో మంట లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ మిరియాల లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ సి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అయితే మీరు పాలలో పసుపు, మిరియాల పొడి, శోంటి వేసుకొని మరిగించి కషాయం తయారు చేసుకొని నిద్రపోయే ముందు తాగినట్లయితే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉండవని అంటున్నారు. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా ప్రతినిత్యం ఒక గ్లాసు నీటిలో నల్ల మిరియాల నూనెను కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీరు గనక ప్రతినిత్యం ఇలా చేసినట్లయితే బరువు సమస్యలను దూరం చేసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది