Bobbarlu : ఈ మూడు జబ్బులకి అమృతంలా పనిచేసే బొబ్బర్లు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bobbarlu : ఈ మూడు జబ్బులకి అమృతంలా పనిచేసే బొబ్బర్లు…!

 Authored By aruna | The Telugu News | Updated on :19 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Bobbarlu : ఈ మూడు జబ్బులకి అమృతంలా పనిచేసే బొబ్బర్లు...!

Bobbarlu : మన ఆరోగ్యానికి అలసందలు చాలా మేలు చేస్తాయి. ఇందులో అనేక పోషక విలువలు మనల్ని కొన్ని రోగాలు దరిచేరకుండా అడ్డుకుంటాయి. ఉడికించిన అలసందలు తింటే మనకు అందులోని అన్ని పోషక విలువలు పొందుతాం.. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, పోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, సోడియం, జింక్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. మనకు ఈ అలసందలు వల్ల ఏ విధంగా ఉపయోగమో నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉడికించిన అలసందలు తింటే అందులోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అంటే పోషకాలు మన శరీరానికి అందుతాయి. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు ఆందోళన మరియు ఒత్తిడి తగ్గిస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది.

అలసందలలో ఫైబర్, ప్రోటీన్ ఉన్నందున రక్తంలో చెడు కొలెస్ట్రాల స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాదు మన శరీరంలో కొలెస్ట్రాల స్థాయిని తగిన విధంగా ఉండేలా కంట్రోల్ చేస్తుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. అలసందలు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తుంది. అలసందలు తినటం వల్ల కిడ్నీలో పనితీరు మెరుగుపరుస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు అలసందలు తీసుకోవడం ద్వారా అందులోని సోడియం ఉండటం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి బరువును తగ్గిస్తుంది. అలసందలలో విటమిన్ విటమిన్ సి ఉండటం వల్ల చర్మం అందంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు నిత్య యవ్వనంగా కనిపించేలా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. అలసందలలో యాంటీ ఆక్సిడెంట్ ఉన్నందున జుట్టు బలంగా ఆరోగ్యంగా పొడవుగా పెరగటానికి దోహదపడుతుంది.

జుట్టు ఊడిపోవడం సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు జుట్టు ఎదిగేలా సహాయం చేస్తుంది. అలసందలలో విటమిన్ ఏ అధికంగా ఉన్నందున కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు కంటిచూపులు మెరుగుపరుస్తుంది. అలసందలు తినడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇందులోని పోషక విలువలు మనల్ని బలంగా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. మలబద్దక సమస్యతో బాధపడేవారు ఉడికించిన అలసందలు తింటే సుఖమల విరోచనం అవుతుంది. అలసందలలో జింక్ ఉన్నందున శృంగార జీవితం ఆనందంగా ఉండేలా చేస్తుంది. అలసందలు సెక్స్ సామర్థ్యం పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది