Diabetes : డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగవచ్చా… తాగితే ఏం జరుగుతుంది…!!
Diabetes : డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం.. డయాబెటిస్ ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ వెంటాడుతుంది. భారతదేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్లకు పైగా మధుమేహం మారిన పడిన వారున్నారని నివేదికలు చెబుతున్నాయి. రోజురోజుకు ప్రపంచాన్నే కమ్మేస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో కూడా ఇది ఒకటి. డయాబెటిస్ బారిన పడినవారు ఆహారపు అలవాటులో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. జీవనశైలి మార్చుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.ఇష్టానుసారంగా ఆహారం తీసుకోవడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉందంటున్నారు. ఈ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అధికంగా మద్యం తీసుకున్నట్లయితే కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
అంతేకాదు మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలతో పాటు పానీయాలకు కూడా దూరంగా ఉండటం మంచిది అంటున్నారు వైద్యులు. మద్యం తాగడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ముందే డయాబెటిస్ ఉన్నట్లయితే మద్యానికి దూరంగా ఉండటం మంచిది అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మద్యం తాగినా మదన సమస్య పెరిగే అవకాశాలు ఉండవచ్చు. మధుమేహం వచ్చిన వారిలో సమస్య వారి నాడులు నాటికణాలు దెబ్బతింటాయి.ఉన్నవారు మద్యం తాగితే రెట్టింపు వేగంతో నాడులు దెబ్బతింటాయి అంటున్నారు.
దీనికి కారణంగా ఒళ్లంతా మంటలు పుట్టడం, తిమ్మిర్లు ఎక్కువగా రావడం అలాగే సుదుల్తో పొడిచినట్టు అనిపించడం వంటి సమస్యలు మొదలు అవుతాయి. పరిస్థితి ఇంకా ముదిరినట్లయితే కాళ్లు పాదాలు మోద్దుగా ఉంటూ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మధుమేహం ఉన్నవారు అనుకోకుండా మద్యం తాగాల్సి వస్తే కొద్దిసేపటి తర్వాత పుష్టిగా భోజనం చేయాలి. ఆ తర్వాత డయాబెటిస్ కు సంబంధించిన మందులు వేసుకోవాలి. మద్యం తాగిన తర్వాత భోజనం చేయకుండా మందులు వేసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం తాగిన తర్వాత మందులు వేసుకున్నట్లయితే ఇవి రెండు కొత్త సమస్యలను కూడా సృష్టించవచ్చు. దీనివల్ల ఛాతిలో మంట రావడం, వాంతులు కొన్ని సందర్భాల్లో రక్తపు వాంతులయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు మద్యానికి దూరంగా ఉంటే మంచిది.