Drink Water : నిలబడి నీళ్లు త్రాగవచ్చా… త్రా గితే నిజంగా మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు వస్తాయా…!!
Drink Water : ప్రస్తుతం మనలో చాలా మందికి కూడా నిలబడి నీళ్లు తాగటం ఒక అలవాటు. వాస్తవానికి నిలబడి నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. దీని వలన జరిగే అనర్ధాలలో ఒకటి మోకాళ్ళ నొప్పులు రావటం. అందువలన నీరు లేక ఏదైనా ద్రవాన్ని నిలబడి తాగకూడదు, కూర్చొనే తాగాలి అని మన చుట్టూ ఉన్నటువంటి వారు చెబుతూ ఉంటారు. నిలబడి నీళ్లు తాగటం వలన జీర్ణక్రియ అనేది చెడిపోయి ఆహారం అనేది జీర్ణం కావడానికి ఎంతో కష్టం అవుతుంది. దీనివలన మలబద్ధక సమస్య అనేది వస్తుంది అనే అపోహలు కూడా ఉన్నాయి. అంతేకాక నీళ్ల ను నిలబడి తాగటం వలన తీవ్రమైన కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి అని ఎవరో ఒకరు నోటి వెంట మనం వింటూనే ఉంటాం. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడి నీళ్లను తాగకూడదు. నీళ్లను నిలబడి తాగటం వలన కీళ్ల నొప్పుల సమస్యలు వస్తాయని,అంతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చాలామంది అంటున్నారు. అంతేకాక నిలబడి నీళ్లు తాగటం వలన దాహం అనేది తీరదు. అలాగే పదే పదే దాహం వేస్తుంది అని జనాలు అంటున్నారు. అసలు ఇంతకీ వీటికి సంబంధించినటువంటి ICMR ఏమి చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మన దేశంలో ఉన్న అతిపెద్ద వైద్య పరిశోధన సంస్థ అయినా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ త్రాగునీటికి సంబంధించి సమాచారాన్ని ప్రస్తుతం నివేదిక రూపంలో రిలీజ్ చేసింది. నిలబడి నీరు తీసుకోవడం వలన కాళ్ళ కు మరియు శరీరానికి హాని కలుగుతుంది అనటానికి ఎలాంటి రుజువు అనేది లేనేలేదు. కావున దీనికి సంబంధించి ఖచ్చితమైన నిజాలు, ఆధారాలు అనేవి ఇంతవరకు కూడా ఏ పరిశోధనలో బయటపడలేదు. అందుకే నిలబడి లేక కూర్చొని ఎలా నీరు త్రాగిన సరే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు అని ICMR తెలిపింది.
నిపుణులు ఏమంటున్నారంటే : ఢిల్లీలోనే సప్డ్ ర్ హాస్పటల్ లోని మెడిసిన్ విభాగం హెచ్ ఓ డి ప్రొఫెసర్ డాక్టర్ జూగల్ కిషోర్ దీని గురించి మాట్లాడుతూ, నిలబడే నీరు త్రాగటం వలన హాని కలుగుతుంది అనేది ఏ శాస్త్రీయ పరిశోధనలో తెలపలేదు. తాజాగా ICMR కూడా నీటిని ఏ విధంగానైనా తాగవచ్చు అని ధృవీకరించింది. నీళ్లను నిలబడి త్రాగకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. ఈ సమస్యలు అన్ని నిలబడి నీరు త్రాగటం వలన వస్తాయి అని, అలాగే నిలబడి నీళ్లు త్రాగటానికి మరియు శరీరంలోని వ్యాధులకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు అని తెలిపారు. అందుకే నిలబడి లేక కూర్చొని నీరు ఏ విధంగా త్రాగినా సరే ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు.
Drink Water రోజుకు ఎంత నీరు త్రాగాలి
ప్రతినిత్యం పుష్కలంగా నీరు త్రాగాలి అనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రతినిత్యం కూడా 8 నుండి 10 గ్లాసుల నీరు తప్పకుండా తీసుకోవాలి. వేసవిలో మాత్రం నీళ్ళ ని ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది…