Chicken Soup : జలుబు,దగ్గు సమస్యతో బాధపడుతున్నారా… ఒక కప్పు ఈ సూప్ తీసుకోండి… సమస్యలకు చెక్ పెట్టండి…!
ప్రధానాంశాలు:
Chicken Soup : జలుబు,దగ్గు సమస్యతో బాధపడుతున్నారా... ఒక కప్పు ఈ సూప్ తీసుకోండి... సమస్యలకు చెక్ పెట్టండి...!
Chicken Soup : వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇక జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా మొదలైనట్టే. అయితే ఈ జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతులో గరగర లాంటి సమస్యలకు మన ఇంట్లోనే కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అయితే పసుపు కలిపిన పాలను తాగమంటున్నారు. అలాగే వేడివేడి సూప్ ను తాగమని సజిషన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వేడి వేడి చికెన్ సూప్ తాగటం వలన ఎంతో రిలీఫ్ ఉంటుంది. అంతేకాక చికెన్ సూప్ తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. అయితే మామూలుగా మనకు జలుబు చేసినప్పుడు మనకు అసలు ఏమి తినబుద్ధి కాదు. కానీ ఇలాంటి చికెన్ సూప్ అయితే టేస్టీగా లోపలికి వెళ్ళిపోతుంది. అంతేకాక శరీరానికి మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇలా సూప్ తీసుకోవడం వలన శరీరానికి కావలసిన అమైనో యాసిడ్లు కూడా లభిస్తాయి…
అంతేకాదు ఎప్పుడు కూడా ఆకలిగా లేదు అని చెప్పేవారు చికెన్ సూప్ తీసుకోవటం వలన ఆకలి అనేది వేస్తుంది అని పరిశోధనలు తెలిపాయి. అయితే ఈ మాంసపు రుచితో కూడినటువంటి సూప్ ను తీసుకోవడం వలన మెదడులో ఉంటే నరాలు కూడా ఎంతో యాక్టివ్ అయ్యి నాలుకకు టేస్ట్ ను తెలియజేస్తాయి. దానికి అనుకూలంగా మన బాడీ కూడా ఆహారాన్ని తీసుకునేందుకు రెడీగా ఉంటుంది. అలాగే ఫ్లూ, ముక్కుదిబ్బడ, మందపాటి శ్లేష్మం,జలుబు లాంటి సమస్యలు కూడా రాకుండా ఉండేందుకు బాడీ లోని తెల్ల రక్త కణాలు రక్తంలో కలిసి ఎఫెక్ట్ అయ్యి శరీర భాగాలకు చేరి తమ పనిని మొదలు పెడతాయి. అయితే తెల్ల రక్త కణాలు ఆ పనిని యాక్టివ్ గా చేయడానికి చికెన్ సూప్ ఎంతో హెల్ప్ చేస్తుంది అని డైటీషియన్లు అంటున్నారు…
అయితే ఈ సూట్లను తయారు చేసేటప్పుడు చికెన్ తో పాటుగా మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసేలా కొన్ని రకాల కూరగాయలు మరియు దినుసులు మరియు సుగంధ ద్రవ్యాలను కూడా తీసుకోవాలి వేడి వేడి చికెన్ సూపు నుండి వచ్చే వాసన పెరగడం వలన నాసిక మరియు శ్వాసకోస నాళాల టెంపరేచర్ కూడా ఎంతో పెరుగుతుంది దీని వలన శ్వాసకోశ వ్యాధుల వలన వచ్చే స్నేహం నుండి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది…