Congee : గంజి లో ఉన్న పోషకాలు తెలిస్తే నోరేళ్ల బెడతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Congee : గంజి లో ఉన్న పోషకాలు తెలిస్తే నోరేళ్ల బెడతారు…!

Congee : కలుషిత నీరు డిహైడ్రేషన్ వల్ల వచ్చే వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరంలో నీరు వేగంగా కోల్పోవడమే కాకుండా లవణాలు కనిజాల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల చాలా బలహీనత వస్తుంది. ఈ పోషకాహార లోపాలను త్వరగా తొలగించడంలో గంజి చాలా సహాయపడుతుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. వాస్తవానికి ఆయుర్వేదంలో చాలా వ్యాధులను ఆహారం ద్వారా నయం చేసే పద్ధతులు ఉన్నాయి. విరోచనం అయినప్పుడు గంజిని […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 February 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Congee : గంజి లో ఉన్న పోషకాలు తెలిస్తే నోరేళ్ల బెడతారు...!

Congee : కలుషిత నీరు డిహైడ్రేషన్ వల్ల వచ్చే వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరంలో నీరు వేగంగా కోల్పోవడమే కాకుండా లవణాలు కనిజాల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల చాలా బలహీనత వస్తుంది. ఈ పోషకాహార లోపాలను త్వరగా తొలగించడంలో గంజి చాలా సహాయపడుతుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. వాస్తవానికి ఆయుర్వేదంలో చాలా వ్యాధులను ఆహారం ద్వారా నయం చేసే పద్ధతులు ఉన్నాయి. విరోచనం అయినప్పుడు గంజిని వాడితే తొందరగా ఉపశమనం ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ లో లేనప్పుడు అప్పట్లో గంజిలో అన్నం వండేవారు.

అన్నం ఉడికిన తర్వాత అందులో ఉండే మిగిలిన నీటిని వేరు చేసేవారు. దీనినే గంజి అంటారు. అన్నంలోని పోషకాలన్నీ దీనిలోనే ఉంటాయి. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ గంజిలో నల్ల ఉప్పు కలుపుకొని తాగితే శారీరక బలహీనత తొలగిపోతుంది. ఎందుకంటే ఇందులో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది విరేచనాలకు కూడా నయం చేస్తుంది. గంజి తయారు చేయడానికి కుక్కర్లో కాకుండా ఏదైనా గిన్నెలో కొంచెం బియ్యం తీసుకోండి. అందులో కొద్దిగా నీరు పోసి తక్కువ మంట మీద ఉడికించండి. అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీటిని ఒక పాత్రలో వడకట్టుంది. మీరు తెల్లగా మందంగా ఉంటుంది దీనినే గంజి అంటారు..

దీనిలో బ్లాక్ సాల్ట్ కలుపుకొని తాగాలి.. ఈ విధంగా తాగినట్లయితే ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో రక్త కణాలు పడిపోయినప్పుడు ఈ గంజి తాగినట్లయితే తొందరగా రక్తకణాల పెరుగుదల అనేది జరుగుతుంది. అలాగే జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉన్న సమయంలో గంజిని వేడివేడిగా తాగినట్లయితే ఆ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. గంజిలో ఐరన్, క్యాల్షియం కాపర్ పుష్కలంగా ఉంటాయి.. ఈ గంజి మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్ అందజేస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది