Dandruff : తలలో చుండ్ర సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… ఈ హోమ్ రెమిడీ పాటించండి…??
Dandruff : చలికాలం రానే వచ్చింది. అయితే ఇతర సీజన్ కంటే చలికాలం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే చలికాలంలో కేవలం చర్మ సమస్యలే కాదు జుట్టు సమస్యలు కూడా ఎక్కువగానే వస్తాయి. అయితే ఎక్కువగా చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది. అలాగే మనకు చుండ్రు అనేది ఒకసారి వచ్చింది అంటే చాలు అది అంత తొందరగా పోదు. ఈ చుండ్రు కారణంగా జుట్టు పొడి బారడంతో పాటు నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే బయటకు వెళ్లాలన్నా కూడా ఎంతో […]
ప్రధానాంశాలు:
Dandruff : తలలో చుండ్ర సమస్యతో ఇబ్బంది పడుతున్నారా... ఈ హోమ్ రెమిడీ పాటించండి...??
Dandruff : చలికాలం రానే వచ్చింది. అయితే ఇతర సీజన్ కంటే చలికాలం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే చలికాలంలో కేవలం చర్మ సమస్యలే కాదు జుట్టు సమస్యలు కూడా ఎక్కువగానే వస్తాయి. అయితే ఎక్కువగా చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది. అలాగే మనకు చుండ్రు అనేది ఒకసారి వచ్చింది అంటే చాలు అది అంత తొందరగా పోదు. ఈ చుండ్రు కారణంగా జుట్టు పొడి బారడంతో పాటు నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే బయటకు వెళ్లాలన్నా కూడా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాక చుండు నివారణకు ఇప్పటికీ ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ కూడా తెలుసుకున్నాం. అయితే తాజాగా మీకోసం ఇప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ ను మీ ముందుకు తీసుకు వచ్చాం. అయితే ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం…
కలబంద మరియు టీట్రి ఆయిల్ కలిపి హెయిర్ ప్యాక్ లా చేసుకొని తల కు అప్లై చేసుకుంటే చాలా మంచిది. దీనిలో ఫంగస్ మరియు బ్యాక్టీరియాను తగ్గించే గుణాలు దాగి ఉన్నాయి. కావున ఈ రెండిటిని కలిపి వాడితే చలికాలంలో సమస్య అనేది సులువుగా తగ్గిపోతుంది. అలాగే కొబ్బరి నూనె మరియు నిమ్మరసంతో కూడా చుట్టూ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ రెండిటినీ మిక్స్ చేసి తలకు పట్టిస్తే చుండ్రు అనేది ఈజీగా తగ్గిపోతుంది. కేవలం 10 నిమిషాల పాటు అలా ఉంచి ఆ తర్వాత తల స్నానం చేస్తే చాలు చుండ్రు సమస్య అనేది తొందరగా పోతుంది. ఇలా గనుక మీరు వారంలో రెండు లేక మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే జుట్టు కూడా డామేజ్ కాకుండా ఉంటుంది…
అరటిపండు మరియు ఆలివ్ ఆయిల్ హెయిర్ ప్యాక్ తో కూడా చుండ్రును నియంత్రించవచ్చు. అలాగే అరటి పండు కూడా జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అయితే అరటిపండు జుట్టును మెరిసేలా మరియు హైడ్రేడ్ చేస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్ జుట్టు పొడిబారడాన్ని కూడా నియంత్రిస్తుంది. ఈ ప్యాక్ వేసి పదిహేను నిమిషాల తర్వాత స్నానం చేస్తే చాలు సమస్య ఈజీగా తగ్గిపోతుంది…