Dandruff : ఈ రెండిటితో చుండ్రు సమస్యలను ఈజీగా తొలగించవచ్చు… ఎలాగంటే..?
ప్రధానాంశాలు:
Dandruff : ఈ రెండిటితో చుండ్రు సమస్యలను ఈజీగా తొలగించవచ్చు... ఎలాగంటే..?
Dandruff : పురాతన కాలం నుండి కొబ్బరి నూనెను జుట్టు సంరక్షణకు వాడేవారు మన పూర్వీకులు. అయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ కొబ్బరి నూనెను వంటలలో బాగా వాడేవారు. అయితే ఈ కర్పూరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెండిటితో చుండ్రు సమస్యలను ఈజీగా వదిలించుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్పూరం అనేది చర్మ మరియు సౌందర్య రక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కర్పూరం మరియు కొబ్బరి నూనె ఈ రెండు ఎలిమెంట్స్ ను కలగలిపి తయారు చేసే మెటీరియల్ కి ఉన్న ప్రాముఖ్యత ఎంతో మందికి తెలియదు. అయితే కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి హెయిర్ కండిషనర్ గా కూడా పని చేస్తాయి.
అలాగే ఈ కొబ్బరి తలకు నూనెను అప్లై చేయడం వలన వెంట్రుకల కు తేమా అనేది అందుతుంది. ఈ నూనెలో యాంటీ మైక్రో బయాల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనెను తలకు అప్లై చేయడం వలన వర్షాకాలంలో తలపై వచ్చే ఫంగల్ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే కర్పూరం యాంటీ సెప్టిక్ గా మరియు యాంటి ఫంగల్ గా కూడా పని చేస్తుంది. అయితే ఈ కర్పూరం చుండ్రు మరియు ఫంగస్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతేకాక ఈ కర్పూరం తీసుకోవడం వలన జలుబు కూడా నియంత్రించవచ్చు. ఇక ఈ కర్పూరం అనేది వెంట్రుకల ఆరోగ్యాన్ని రక్షించడం లో కూడా ఎంతో సహాయపడుతుంది. ఈ ప్రత్యేక పదార్థం నెత్తిమీద రక్తప్రసరణను కూడా సాధారణంగా ఉంచటంలో హెల్ప్ చేస్తుంది.
అంటే శిరోజాల ఆరోగ్యాన్ని రక్షించేందుకు కర్పూరం మరియు కొబ్బరి నూనె ఎంతో ముఖ్యమైనది. మీరు ఈ రెండిటిని మిక్స్ చేస్తే వీటి నాణ్యత ఎంతగానో పెరుగుతుంది. అలాగే కర్పూరం మరియు కొబ్బరి నూనె లాంటి వాటిని తలకు డైరెక్ట్ గా పట్టించటం కూడా మంచిది కాదు. అందుకు ప్రత్యేక నిబంధనలు పాటించాలి. అప్పుడే తల చర్మం, చుండ్రు, ఫంగస్ అనేది లేకుండా ఉంటుంది. ఒక అర కప్పు కొబ్బరి నూనెలో ఒక గ్రాము కర్పూరాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కర్పూరం పూర్తిగా దానిలో కరగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని తల స్నానం చేసే ముందు మాత్రమే తలకు పట్టించుకుంటే మంచిది. అలాగే అరగంట పాటు ఉంచి తేలికపాటి షాంపుతో తల స్నానం చెయ్యాలి. ఇలా గనక మీరు వారానికి రెండు లేక మూడు సార్లు గనుక చేసినట్లయితే మీ తలలో ఉన్న చుండ్రు మాయం అవుతుంది…