Curry Leaves Benefits : కరివేపాకును ఖాళీ కడుపుతో తీసుకుంటే.. ఈ 5 వ్యాధులు మటుమాయం…!!
Curry Leaves Benefits : ప్రకృతి మనకి ప్రసాదించిన మొక్కలలో మనం ఎంతగానో వినియోగించి మొక్క కరివేపాకు మొక్క. ఈ కరివేపాకులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. దీన్ని వంటకాలలో సువాసన కోసం వాడుతూ ఉంటారు. ఈ కరివేపాకులను దక్షిణ భారత వంటల్లో అధికంగా వినియోగిస్తారు. అయితే భోజనం చేసే సమయంలో మాత్రం దీనిని పడేస్తూ ఉంటారు. అటువంటి కరివేపాకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిలో విటమిన్లు కాపర్, ఐరన్ ,క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. దీనిని పరిగడుపున తీసుకుంటే ఎన్నో రోగాలు పరార్.. అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కరివేపాకు తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… *అధిక బరువును తగ్గిస్తుంది: కరివేపాకు ఆకులను నమలడం వలన బరువు పొట్ట కొవ్వు తగ్గుతాయి. ఎందుకంటే దీనిలో ఇతైల్, అసిటేట్ లో రోమిధన్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. *కళ్ళకు మేలు చేస్తుంది: కరివేపాకులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.కంటి ప్రమాదాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. *ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది: కరివేపాకులు యాంటీ ఫంగల్ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇది ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. *మధుమేహం నియంత్రణ: బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసి హైపోగ్ గ్లైసిమిక్ లక్షణాలు కారణంగా కరివేపాకులను డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు నిత్యం తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది. *జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది; నిత్యం ఖాళీ కడుపుతో కరివేపాకుని తీసుకోవడం వలన మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే యాసిడిటీ ,మలబద్దకం ఉబ్బరం మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.. అలాగే ఇది జుట్టు ఎదుగుదలకు జుట్టు సమస్యల నుంచి రక్షించడానికి కూడా ఈ కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది..