Mouth : నోటిపూతతో ప్రాణాలు పోతాయ్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mouth : నోటిపూతతో ప్రాణాలు పోతాయ్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

Mouth : ఈ రోజుల్లో నోటిపూత అదే నోటి క్యాన్సర్ ను లైట్ తీసుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నోటి క్యాన్సర్ ను లైట్ తీసుకుంటే మాత్రం ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నారు. నోటి క్యాన్సర్ ను ముందుగానే గమనిస్తే మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే దాని లక్షణాలు తెలిస్తే మాత్రం ఈజీగా గుర్తించవచ్చు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Mouth : నిరంతర నొప్పి, అసౌకర్యం.. నోటి క్యాన్సర్ లో మనకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2024,7:00 am

Mouth : ఈ రోజుల్లో నోటిపూత అదే నోటి క్యాన్సర్ ను లైట్ తీసుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నోటి క్యాన్సర్ ను లైట్ తీసుకుంటే మాత్రం ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నారు. నోటి క్యాన్సర్ ను ముందుగానే గమనిస్తే మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే దాని లక్షణాలు తెలిస్తే మాత్రం ఈజీగా గుర్తించవచ్చు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mouth : నిరంతర నొప్పి, అసౌకర్యం..

నోటి క్యాన్సర్ లో మనకు ఎక్కువగా కనిపించేది మాత్రం నొప్పి, అసౌకర్యంగా ఉండటమే. మన నోటికి ఏదో అడ్డు పడినట్టుగా ఉంటుందని మనకు అనిపించినప్పుడు మాత్రం కచ్చితంగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలా చేయకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు.

Mouth : నోటి లోపల తెలుపు లేదా ఎరుపు పాచెస్

నోటి క్యాన్సర్ సోకినప్పుడు మనకు నోట్లో కనిపించేవి మాత్రం తెలుపు లేదా ఎరుపు పాచెస్. ఇవిఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎరుపు చారలు కనిపించినప్పుడు మాత్రం అస్సలు అశ్రద్ద చేయవద్దు. కొన్ని సార్లు పుండ్లు లేదా పూత కూడా వస్తుంది. అవి వారం రోజుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి.

Mouth : స్వరంలో మార్పులు..

నోటి క్యాన్సర్ సోకినప్పుడు గొంతులో మార్పు వస్తుంది. గొంతు బొంగురుపోవడంతో పాటు వాయిస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా జరిగినప్పుడు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి మన ఇబ్బందులను చెప్పుకోవాలి.

Mouth : గొంతులో ఏదో ఇరుక్కుపోయిన ఫీలింగ్..

నోటి క్యాన్సర్ సోకినప్పుడు మాత్రం మన గొంతులో ఏదో ఇరుక్కుపోయిన ఫీలింగ్ కలుగుతుంది. నోటి క్యాన్సర్ లక్షణం కావచ్చు లేదా ఇతర డైస్పాగియా అని పిలవబడేవి కూడా ఉంటాయి. కాబట్టి అలాంటివి కనిపించినప్పుడు మాత్రం ఆహారం మింగడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది.

Mouth నోటిపూతతో ప్రాణాలు పోతాయ్ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Mouth : నోటిపూతతో ప్రాణాలు పోతాయ్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

నిరంతర దగ్గు..

నోటి క్యాన్సర్ వచ్చినప్పుడు నిరంతరం దగ్గు వస్తుంది. అంతే కాకుండా శ్వాస సంబంధిత సమస్యలు కూడా వస్తుంటాయి. కాబట్టి దీర్ఘకాలిక దగ్గులాంటివి ఉంటే వైద్యుల సలహాలు తీసుకుంటే బెటర్ అనిఅంటున్నారు.

మాట్లాడటంటో ఇబ్బంది..

నోటి పూత వచ్చినప్పుడు మనకు చాలానే ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటి వాటిలో ఎక్కువగా మనకు కనిపించేది మాత్రం మాట్లాడటంలో ఇబ్బందిగా ఉంటుంది. నమలడం, మాట్లాడటంలో మనకు ఇబ్బందిగా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే బెటర్.

నోటిలో తిమ్మిరి..

నోటిలో తిమ్మిరిగా ఉంటే మాత్రం కచ్చితంగా నోటి పూత వస్తుందని జాగ్రత్త పడాలి. అది నరాలను మరింత డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఈ లక్షణం కనిపిస్తేడాక్టర్ వద్దకు వెళ్లాలి.

దవడ లేదా నాలుకలో అస్వస్థత…

దవడ నొప్పిగా ఉన్నా లేదంటే నాలుక కదిలించడంలో ఇబ్బందిగా అనిపించినా సరే నోటి క్యాన్సర్ వచ్చిందని గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో మీరు నోరును పూర్తిగా తెరవలేకపోతుంటారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది