Mouth : నోటి పోతే కదా అనుకోకండి.. ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mouth : నోటి పోతే కదా అనుకోకండి.. ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతం…!

 Authored By ramu | The Telugu News | Updated on :15 February 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Mouth : నోటి పోతే కదా అనుకోకండి.. ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతం...!

Mouth : సాధారణంగా నోటి పూత ప్రతి ఒక్కరిలో కనిపించే సమస్య. ఎవరు కూడా దీనిని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇది ఏ వయసులో అయినా వస్తుంది. ఇక ఇది నోటి లోపల నాలుగు పైన లేదా బుగ్గలు మరియు గొంతు లోపల, పెదవులపైన వస్తాయి. ఇవి కొన్ని రోజులు తినడానికి తాగడానికి మాట్లాడ్డానికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇవి మానిపోతాయి. ఈ క్రమంలోనే ఇలా తరచూ రావడం లేదా ఎక్కువ రోజులు ఉంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇవి మీ శరీరంలోనే కొన్ని తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు. మరి ఇలా తరచూ రావడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Mouth నోటి పోతే కదా అనుకోకండి ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతం

Mouth : నోటి పోతే కదా అనుకోకండి.. ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతం…!

Mouth పోషకాహార లోపం

నోటిపూతకు ప్రధాన కారణం శరీరానికి అవసరమయ్యే పోషకాలు లేకపోవడం. ఐరన్, విటమిన్ బి 12, జింక్ మరియు ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు లోపించినప్పుడు నోటిపూత సమస్య ఏర్పడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఈ పోషకాల ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఈ పోషకాలు లేకపోయినట్లయితే అది నోటిపూతకు దారితీస్తుంది.

Mouth జీర్ణ సమస్యలు

నోటిపూతకు మరో ముఖ్యమైన కాను జీర్ణ వ్యవస్థలోని సమస్యలు. ఎసిడిటీ గ్యాస్ అజీర్తి మలబద్ధకం వంటి కడుపు సమస్యలు ఉన్నట్లయితే అవి శరీరంలోని టాక్సిన్స్ స్థాయిలను పెంచడం జరుగుతుంది. దీంతో నోటి పూతల ప్రమాదం వస్తుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్లయితే కడుపు వ్యాధులు మరియు శరీరంలోని పిత్తం పెరగడం వలన నోటి పూత ఏర్పడుతుంది. ముఖ్యంగా నోటిపూతలు రావడం జీర్ణ సమస్యలు వంటివి ఉన్నట్లయితే అది అంతర్గత సమస్యలకు హాని కలిగిస్తుంది అని అర్థం.

Mouth బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వలన కూడా నోటి పూత వస్తుంది. అయితే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీన పడినప్పుడు శరీరంలోని ఇన్స్పెక్షన్లు వ్యాధులతో పోరాడలేకపోతాయి. దీనివల్ల నోటిలో బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ల సంభావ్యతను పెంచి అల్సర్ కు దారితీస్తుంది.

ఒత్తిడి ఆందోళన

నోటిపూతకు మరొక ముఖ్యమైన కారణం ఒత్తిడి ఆందోళన ఇది శరీరానికి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని పరిస్థితులలో ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలోని కార్డిసాల్ స్థాయి పెరుగుతుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. అంతేకాకుండా శరీరంలో మంటలు పెరిగి నోటిపూతకు దారి తీస్తాయి.

అంటువ్యాధి.

నోటిపూత ల పునరావృత్తానికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ లేదా కాండిడా ఇన్ఫెక్షన్ వంటి కొన్ని వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నోటిపూత ను ఏర్పరుస్తాయి. పదేపదే జ్వరం రావడం బరువు తగ్గడం లేదా గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలు ఉన్నట్లయితే ఇది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతంగా చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితులలో వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది