Diabetes Patients : మధుమేహంతో బాధపడేవారు ఉదయం తీసుకునే ఆహారంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!
ప్రధానాంశాలు:
Diabetes Patients : మధుమేహంతో బాధపడేవారు ఉదయం తీసుకునే ఆహారంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి...!
Diabetes Patients : ప్రస్తుతం సమాజంలో ఉన్న చాలా మందిలో మధుమేహం సమస్య కనిపిస్తోంది. ఇక ఈ మధుమేహం సమస్య ఉన్నవారు కచ్చితంగా ఆహార నియమాలు పాటించక తప్పదు. పాటించకపోతే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. మరిముఖ్యంగా కొన్ని రకాల పొరపాట్లు ఈ సమస్య ఉన్నవారు అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వారి ప్రాణానికి ప్రమాదం అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ యుగంలో చాలామంది ఆహారాన్ని చాలా ఆలస్యంగా తీసుకుంటున్నారు. ఇక ఈ ఊరుకుల పరుగుల జీవితంలో ఉదయం పూట సరిగా తినక అనంతరం తప్పు ఆహారాలు తీసుకోవటం లేదా ఆలస్యంగా ఆహారాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ విధంగా తినడం అనేది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
అంతేకాదు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చాలాసేపటి వరకు ఖాళీ కడుపుతో ఉన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఆహారాలను అస్సలు తీసుకోకూడదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. మధుమేహం సమస్య ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తీసుకున్నట్లయితే రక్తంలోని చెక్కేర స్థాయిలు అమాంతంగా పెరుగుతాయట. కాబట్టి షుగర్ పేషెంట్లు అల్పాహారం తీసుకునే సమయంలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. మరి ఈ సమస్యతో బాధపడేవారు ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోవాలి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం తీసుకునే ఆహారంలో ఫైబర్ శాతం అధికంగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా రక్తంలోని అదనపు చక్కెరను అనుగ్రహిస్తాయి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడం జరుగుతుంది. కావున ఫైబర్ అధికంగా కలిగిన ఆహారాలు అంటే ఓట్స్ , పిండిరొట్టె ఉడికించిన శనగలు వంటి ఆహారాలను అధికంగా తీసుకోవాలి. అలాగే ఉదయం పూట కేవలం తృణ ధాన్యాలను మాత్రమే అస్సలు తీసుకోకూడదు. పండ్లు కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే చపాతీ లేదా బ్రెడ్ తీసుకునే సమయంలో కూరగాయలతో చేసిన కూరలను కలిపి తీసుకోవడం మంచిది.
అలాగే ప్రతిరోజు ఉదయం పూట పిండితో కూడిన ఆహారాలను అసలు తీసుకోకూడదు. లూసీ పరాటా కచోరి బ్రెడ్ వంటి ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఉదయం అల్పాహారంలో బిస్కెట్లు కేకులు వంటివి కూడా అసలు తినకూడదు. అదేవిధంగా బంగాళదుంపతో తయారుచేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాలను ఉదయం పూట తీసుకోవటం మంచిది. అలాగే షుగర్ కలిగిన ఆహారాలను పూర్తిగా మానుకోవడం మంచిది.