Diabetes: షుగర్ పేషెంట్లు ఈ పండ్లను తినొచ్చు.. ఎప్పుడు తినాలంటే..?
Diabetes : ప్రస్తుతం కాలంలో ఎక్కువ మందికి ఉంటున్న రోగం ఏదైనా ఉందా అంటే అది షుగర్. ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా చాలామందికి వస్తోంది. అయితే ఈ వ్యాధి చాలా రకాలుగా ఉంటుంది. ఒక్కో స్టేజ్ లో ఒక్కో రకంగా దీని ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎలాటి పండ్లు తీసుకోవాలి అనేది అందరికీ ఉండే సందేహం. చాలామంది ఏ పండ్లు తినకూడదు అనుకుంటారు. ఎందుకంటే అన్ని పండ్లు తీయగా ఉంటాయి కాబట్టి పండ్లు తనరు. కానీ గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుకునేందకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.
ముఖ్యంగా కూరల్లో ఆకు కూరలతో పాటు చిక్కుడు కాయలు లాంటివి తింటూ ఉండాలి. ఇక పండ్ల విషయానికి వస్తే మాత్రం ఏవి పడితే అవి తినకూడదు. పండ్లలో చాలా వాటిల్లో పీచుపదార్థాలు ఉంటాయి. ఇలాంటి పండ్లు తింటే మాత్రం గ్లూకోజ్ లెవల్స్ బాగా పెరుగుతాయి. అయితే షుగర్ పేషెంట్లు యాపిల్స్, ద్రాక్షపండతో పాటుగా పీచెస్, బేరి, రేగు, అలాగే అవకాడోస్, చెర్రీస్ లాంటి పండ్లు తినొచ్చు. ఇందులో గ్లూకోజ్ చాలా తక్కువగా ఉంటుంది. మెటబాలిక్ సమస్య ఉంటే మాత్రం ఎక్కువగా అరటి లేదా మామిడి పండ్ల రసాలు తీసుకోవాలి.
Diabetes : ఏ సమయంలో తినాలంటే..
అయితే ఎప్పుడు పడితే అప్పుడు పండ్లు తినకూడదు. ఎందుకంటే షుగర్ పేషెంట్లలో చాలా వరకు జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ వ్యాధి గ్రస్తులు మధ్యాహ్న సమయంలోనే ఎక్కువగా పండ్లు తింటూ ఉండాలి. ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల దాకా పండ్లు తింటే జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. ఇక యోగా లేదా వ్యాయామం చేసే వారు కూడా ఈ సమయాల్లోనే తీసుకుంటే చాలామంచిది. ఇలా పండ్లు తినడం వల్ల , విటమిన్లు పుష్కలంగా మన శరీరానికి లభిస్తాయి. ఇవి మన బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి బాగా ఉపయోగపడుతాయి.