Diabetes : డయాబెటిస్ ఉన్న వాళ్లు మటన్, చికెన్ తింటే ఏం జరుగుతుందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : డయాబెటిస్ ఉన్న వాళ్లు మటన్, చికెన్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 Authored By pavan | The Telugu News | Updated on :9 May 2022,10:00 pm

Diabetes : షుగర్ మరియు అనేక విధాలైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నాన్ వెజ్ తినడం గురించి మరికాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మరికొన్ని కొత్త సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లు నాన్ వెజ్ తినొచ్చా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. అయితే దీని గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ అనేది ప్రస్తుత కాలంలో చాలా మందికి వస్తుంది. అంతే కాకుండా వంశ పారంపర్యంగా కూడా ఇది సంక్రమిస్తుంది. అలాగే క్లోమ గ్రంధి సరిగ్గా పని చేయకపోవడం వల్ల కూడా డయాబెటిస్ అనేది వస్తుంది. ఇది టైప్-1 మరియు అస్తవ్యస్త జీవన విధానం వల ఆహారపు అలవాట్లు వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుంది.

టైప్ 1 కన్నా టైప్ 2 చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే మన ఇండియాని డయాబెటిస్ కు రాజధాని అని అంటారు. డయాబెటిస్ వచ్చిన వాళ్లు ముఖ్యంగా అనేక జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్న వాళ్లు తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు తక్కువాగ ఉండేట్లు చూసుకోవాలి. ప్రోటీన్స్ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఇతర ఆహారపు అలవాట్లలో జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడు షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్లకి మాంసాహారం తినడంలో అనేక సందేహాలు ఉంయాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లు మాంసాహారాన్ని తినవచ్చు. కానీ పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మాంసాహారంలో కొవ్వు కూడా ఉంది. మాంసాహారం అధికంగాఉండే తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందు వల్ల గుండెం జబ్బులకు ఆస్కారం ఉంటుంది.

Diabetes people can eat non veg

Diabetes people can eat non veg

డయాబెటిస్ ఉన్న వాళ్ల 15 రోజులకు ఒకసారి 75 గ్రాముల మటన్ తీసుకోవచ్చు. అది కూడా బాగా ఉడికించి మాసాలాలు, కారాలు లేకుండా తినాలి. అంతే కాకుండా అది లేత మటన్ అయి ఉండాలి. చికెన్ అయితే వారానికి 75 గ్రాములకు మించి తనకూడదు. సీ ఫుడ్స్ విషయంలో చేపలు వారానికి రెండు సార్లు తినవచ్చు. కానీ 75 గ్రాములు మించి తినకూడదు. దీన్ని బట్టి డయాబెటిస్ ఉన్న వాళ్లు కూడా మాంసాహారాన్ని తక్కువ మోతాదులో తినడంలో ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేని వాళ్లు మాత్రం మాంసాహారాన్ని పూర్తిగా తినడం మానేస్తేనే చాలా మంచిది. షుగర్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత మాంసాహారం తివచ్చని డాక్టర్ నిపుణులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది