Diabetics : షుగర్ వ్యాధిగ్రస్తులు ఎండు ద్రాక్ష తీసుకోవచ్చా… వైద్య నిపుణులు ఏమంటున్నారంటే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetics : షుగర్ వ్యాధిగ్రస్తులు ఎండు ద్రాక్ష తీసుకోవచ్చా… వైద్య నిపుణులు ఏమంటున్నారంటే…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2023,7:00 am

Diabetics : చాలామంది ఇప్పుడున్న కాలంలో డయాబెటిస్ తో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మధుమేహం ఉన్నవాళ్లు ఎటువంటి ఆహారం తీసుకోవాలన్న చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఈ మధుమేహం వ్యాధిగ్రస్తులు ఆహారంలో ఎండు ద్రాక్షను తీసుకోవచ్చా.. లేదా.. అని ఎన్నో అనుమానాలతో ఆలోచిస్తున్నారు. ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే దానిని శాశ్వతంగా వదిలించుకోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడున్న జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవచ్చు.. ప్రధానంగా ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తినడానికి రుచిగా ఉన్నప్పటికీ కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. అయితే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎండి ద్రాక్ష తినడంపై ఎంతోమంది ఎన్నో ఆపోహలు ఉన్నాయి.

హల్వా, కేసరి బాత్, పాయసం లాంటి స్వీట్లలో వాడే ఎండు ద్రాక్ష వాటిలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అయితే షుగర్ ఉన్నవాళ్లు ఎందుకు ద్రాక్ష తినకూడదా.. తింటే ఏమవుతుంది అని తదితర అపోహలపై ఆరోగ్య నిపుణులు ఏం తెలియజేస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం.. షుగర్ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంలో ఎండి ద్రాక్షను తీసుకోవచ్చు.. కానీ వాటిని అధికంగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలి. అన్ని పండ్ల లాగే ఎండు ద్రాక్షలో సహజ చెక్కర్లు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కావున దీనిని సమతుల్య ఆహారంలో యాడ్ చేసుకోవచ్చు.. ఎముకలకు మేలు : ఎండు ద్రాక్షలు బోరాన్ అధికంగా ఉంటుంది.

Can Diabetics patients take raisins

Can Diabetics patients take raisins

ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కణజాలలో ఒకటి బోరాన్ ఎముకలను బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ బోరాన్ అద్భుతంగా పనిచేస్తుంది. గుండె బలోపేతం చేయడానికి : ఎండు ద్రాక్షలు ఆంటీ ఆక్సిడెంట్లు ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎండు ద్రాక్ష తీసుకోవడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు… జీర్ణ క్రియ కు మేలు చేస్తుంది : సహజ చెక్కర్లు కాకుండా ఎండు ద్రాక్ష లో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకి ఇది మంచి ఆహారం కాబట్టి మంచి గ్లైసోమిక్

నియంత్రణ నిర్వహించడానికి మితంగా తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. ఇది శరీరం అంతట ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్యాల్షియం, పొటాషియం మరియు బోరాన్ లాంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఎండుద్రాక్షలు కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టను శుభ్రంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. అదేవిధంగా రక్తంలో చక్కెర లెవెల్స్ ని నియంత్రణ ఉంచడంలో ఉపయోగపడుతుంది. అధిక బరువు తగ్గడానికి : ఎండు ద్రాక్షాలు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది అధిక బరువుని తగ్గించడానికి ప్రభావంతంగా పనిచేస్తుంది. అధిక ఫైబర్ ఆహారం తీసుకునే వారు బరువు తగ్గుతారు. ఆహారంలో ఎక్కువ ఫైబర్ జోడించడానికి ఎండు ద్రాక్ష అనుకూలమైనది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది