కరోనా జన్మలో కూడా మీకు సోకకుండా ఉండాలంటే.. ఇవి తినండి.. ఇవి తినకండి.. పూర్తి లిస్ట్ ఇదే?
Corona Diet Chart : కరోనా.. కరోనా.. కరోనా.. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనానే. కరోనా కేసులు దేశవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరం ఎలాగోలా కరోనాను జయించాం. కానీ.. ఈ సారి రెట్టింపు పవర్ తో సెకండ్ వేవ్ రూపంలో మన మీదికి దూసుకొచ్చింది కరోనా. కరోనాను జయించాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. దాన్నే ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ చేయడం అంటారు. మన శరీరంలో రోగనిరోధక శక్తి తగినంత ఉన్నంత మేరకు.. ఏ వైరస్ కూడా శరీరంలో ప్రవేశించలేదు. చివరకు కరోనా కూడా. కరోనా జన్మలో కూడా మీ ముఖం చూడకూడదు.. మీకు సోకకూడదు అంటే.. మీరు ఖచ్చితంగా ఈ ఫుడ్ తినాలి.. ఈ ఫుడ్ తినకూడదు.
కరోనా ఫుడ్ అనేసరికి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది.. మంచి ప్రొటీన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ తినడం. ఇంకా చెప్పాలంటే.. బాడీలో ఆక్సిజన్ లేవల్స్ ను, ఆల్కలైన్ ను పెంచే ఫుడ్ ను తీసుకుంటే.. బాడీలో యాసిడ్ లేవల్స్ తగ్గి.. రోగనిరోధక శక్తి విపరీతంగా పెరగుతుంది. అలాగే.. బాడీలో ఆల్కలైన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటే.. ఏ వైరస్ కూడా శరీరంలో చేరలేదు.
దానికోసం మనం చేయాల్సింది ఎక్కువగా కూరగాయలు తినడం. కూరగాయల్లో ఎక్కువ శాతం ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉంటాయి. టమాటాలు, బీట్ రూట్, క్యారెట్, వంకాయ, క్యాప్సికం, కాలీఫ్లవర్, బ్రకోలీ.. ఇంకా అన్ని ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఇంక పండ్ల విషయానికి వచ్చే… ఎక్కువగా ఆరెంజ్, పైనాపిల్, కివీ పండ్లు, జామ పండ్లు, బొప్పాయి, పుచ్చకాయ, బెర్రీస్ తీసుకోవాలి. ఇక.. సీజనల్ గా దొరికే అన్ని పండ్లను కూడా తింటే.. శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు.. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
Corona Diet Chart : పండ్లు, కూరగాయలే కాదు… డ్రై ఫ్రూట్స్ కూడా తినాల్సిందే
చాలామంది పండ్లు, కూరగాయలు తింటే చాలు అనుకుంటారు కానీ.. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే.. డ్రై ఫ్రూట్స్ కూడా ఖచ్చితంగా రోజువారి ఆహారంలో భాగం కావాలి. బాదాం పప్పు, కిస్ మిస్, వాల్ నట్స్, జీడిపప్పు… ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ.. నానబెట్టుకొని రోజూ గుప్పెడు తింటూ ఉండాలి. అలాగే… రోజూ ఎక్కువ నీళ్లు తాగాలి. మంచినీళ్లలో పాటు కొబ్బరి నీళ్లను కూడా అప్పుడప్పుడు తాగాలి. అప్పుడప్పుడు గ్రీన్ టీ, లెమన్ టీ, జింజర్ టీ, వెల్లుల్లి టీ కూడా తాగితే బెటర్.
Corona Diet Chart : ఏ ఫుడ్ తినకూడదు?
కరోనా టైమ్ అని కాదు కానీ.. చాలామంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అన్నం తింటుంటారు. నిజానికి.. అన్నంలో అన్ని పోషకాలు ఏవీ ఉండవు. అందులో ఉండేది కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే. వాటి వల్ల శరీరానికి వచ్చే ఉపయోగం ఏం లేదు. అందుకే… అన్నం ఎక్కువ మొత్తంలో క్రమం తప్పకుండా తినడం వల్ల.. కడుపు నిండిపోవడంతో వేరే ఫుడ్ జోలికి పోరు. దాని వల్ల అసలైన రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ కాకుండా.. కేవలం కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ నే చాలా మంది తింటుంటారు. అటువంటి వాళ్లకు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే… కనీసం కరోనా టైమ్ లో అయినా.. అన్నం తక్కువ తిని.. పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటే.. ఖచ్చితంగా కరోనా మీ దరికి రానే రాదు.