Coffee : కాఫీ ఎక్కువగా తాగుతున్నారా… అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే…!
Coffee : మన భారతీయులు కాఫీ లేనిదే ఆరోజు గడవదు అనుకుంటారు. చాలామంది ఉదయం లేవగానే ఆరోజున కాఫీ తోనే మొదలుపెడుతూ ఉంటారు. కాఫీ రోజుకి ఒక్కసారైనా తాగుతూ ఉంటారు మరి కొందరు రోజుకి రెండు మూడు సార్లు కంటే ఎక్కువగా త్రాగేస్తూ ఉంటారు. అంతలా కాఫీ టీ లకు జనాలు బానిసలైపోయారు. అయితే కాఫీ తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ఎక్కువగా తాగడం వలన అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కెఫిన్ అనే పదార్థం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
అంతే కాదు కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కాఫీని అస్సలు త్రాగకూడదు. అలాంటి సమస్యలు ఉన్నవారు కాఫీని తాగితే తీవ్ర నష్టాలు జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు ఎక్కువగా తాగడం వలన అరిథ్మియా అనే గుండెకు సంబంధించిన ఒక సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నవారికి గుండె ఇతరులకు కొట్టుకున్న విధంగా సాధారణంగా కొట్టుకోదు. ఈ సమస్య తో బాధపడేవారు కాఫీని అస్సలు త్రాగకూడదు. ఒకవేళ త్రాగితే బీపీ అమాంతం పెరిగిపోతుంది. దీంతో లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు అస్సలు కాఫీ త్రాగకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా కాఫీ ని అస్సలు త్రాగకూడదు.
గర్భిణీ స్త్రీలు కాఫీని త్రాగడం వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గర్భిణి స్త్రీలు కాఫీ తాగితే పోషక లోపం సమస్యతో కూడా బాధపడవచ్చు. అలాగే బాలింతలు కూడా కాఫీ అస్సలు త్రాగకూడదు. బాలింతలు కాఫీ త్రాగడం వలన బాడీలో నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్ బారిన పడతారు. బాలింతలు ఎక్కువసార్లు కాఫీలు తాగితే విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కాఫీని అస్సలు త్రాగకూడదు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కాఫీని ఎక్కువగా త్రాగడం వలన అందులో ఉండే కెఫిన్ అనే పదార్థం నిద్రను మరింత దూరం చేస్తుంది. దీంతో లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే కాఫీలు ఎక్కువగా త్రాగకూడదు.