Diabeties : టైప్2 డయాబెటీస్‌కు దివ్య ఔషధం.. బ్లూ బెర్రీ పండ్లతో చక్కెర వ్యాధికి చెక్!
Diabeties : మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని పలు హెల్త్ సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి దీని బారిన పడ్డారంటే మరణించేంత వరకు మందులు వాడుతూనే ఉంటాలి. దీనికి నివారణ అనేది లేదు. అందుకు తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ కాకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. నిత్యం వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు షుగర్ లెస్ డైట్ మెయింటేన్ చేయాలి. మందుల ద్వారానూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రివచ్చు. కానీ వాటి మీదే ఆధారపడకుండా మంచి ఆహారంతో షుగర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్లూ బెర్రీ పండ్లను తీసుకోవవడం ద్వారా డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.
టైప్2 డయాబెటిస్ తగ్గించడంలో బ్లూ బెర్రీస్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని పోషకాలు జీర్ణక్రియకు మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. బ్లూ బెర్రీస్ తినడం లేదా దీని జ్యూస్ తాగండం వలన టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. వాస్తవానికి బ్లూ బెర్రీస్ అన్ని రకాల డయాబెటీస్ నియంత్రణకు ఉపయోగపడతాయి. పండ్లు మాత్రమే కాకుండా బ్లూ బెర్రీస్ ఆకులు కూడా మధుమేహాన్ని తరిమేస్తాయి. వీటి ఆకులతో తయారైన కషాయాన్ని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. బ్లూబెర్రీ ఆకులు, బెర్రీల్లో అనేక రకాల విటమిన్లు, పోషకాలు కలిగి ఉంటాయి. టైప్ -1 , టైప్ -2 డయాబెటిస్ ఈ పండ్లు దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు.
Diabeties : టైప్-2 డయాబెటీస్‌కు దివ్య ఔషధం..
బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ -సీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు సహా ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రియంట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, బ్లూబెర్రీస్ తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చును. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కూడా ఉపశమనాన్ని పొందవచ్చును. బ్లూ బెర్రీస్ షుగర్ వ్యాధి నివారణలో మాత్రమే కాకుండా జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు యాక్టివ్‌గా ఉంచడంలో సహకరిస్తుంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. బ్లూ బెర్రీస్, వృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదం చేస్తాయని శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు.