మామిడి ఆకులతో షుగర్ అదుపులోకి.. ఎలాగో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!
“డయాబెటిస్” అనే పదం గత కొంతకాలంగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచంలో చాలా మంది ఈ వ్యాదిభారిన పడ్డారు. కేవలం ఒక్క భారతదేశంలోనే 5కోట్లపైగా మంది ఈ వ్యాధి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. ఎంత వైద్యం చేసినా కూడా కొందరిలో షుగర్ లెవెల్స్ అదుపులోకి రావడం లేదు. అయితే మామిడి ఆకులు వాడటం వల్ల షుగర్ కంట్రోల్ చేయవచ్చని చాలామంది చెప్తున్నారు.
2010లో సెంటిస్ట్ లు చేసిన పరిశోధనలో మామిడి ఆకులు షుగర్ ను అదుపులో ఉంచుతాయని తెలిసింది. మామిడి ఆకుల్లో పోషకాలు బాడీలో ఉండే షుగర్ ను తగ్గించడానికి దోహదం పడతాయని సెంటిస్ట్ లు చెప్తున్నారు.
తయారు చేసే విధానం:
మామిడి ఆకులను 15 తీసుకుని వాటిని బాగా కడిగి 100 లేదా 150 ఎంఎల్ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. తరువాత రోజు ఉదయాన్నే ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి. ఇలా రోజ చేయడం వల్ల మూడు నెలల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
మామిడి ఆకులతో తయారు చేసే కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది గూకోజ్న సక్రమంగా వినియోగం అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మామిడి ఆకుల్లో పెక్టిన్, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. అందువల్ల షుగర్ లెవల్స్ తగ్గడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.